వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాన్పూర్ హింస: 29 మంది అరెస్ట్.. వారిపై అభియోగాలివే..

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్‌లో గల కాన్పూర్‌లో చెలరేగిన హింసాకాండలో రెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటివరకు 29 మంది పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం పరేడ్ చౌక్ ఏరియాలో హింస చెలరేగింది. ఘటనలో ప్రధాన నిందితుడిగా స్థానిక ముస్లిం నేత హయత్ జఫార్ హస్మిగా పోలీసులు గుర్తించారు. ఇతను మౌలానా మొహ్మద్ జౌహారీ అలీ ఫ్యాన్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు.

ప్రవక్తపై అలా..

ప్రవక్తపై అలా..


ఇటీవల జ్ఞాన్ వ్యాపి మసీదుకు సంబంధించి చర్చ జరిగింది. టీవీ డిబేట్‌లో నుపూర్ శర్మ.. మహ్మద్ ప్రవక్తపై తప్పుగా మాట్లాడారు. దీంతో వివాదం చెలరేగింది. హయత్ జఫార్ హస్మి కలుగచేసుకున్నారు. పోస్లర్లు, బ్యానర్లు అతికించి.. బంద్‌కు పిలుపునిచ్చారు. ముస్లింలను రెచ్చగొట్టి రాళ్లతో దాడి చేయడానికి ఉసిగొల్పారు. దీంతో రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగింది. దీంతో 39 మంది.. పోలీసులు, జనం గాయపడ్డారు.

అరెస్ట్.

అరెస్ట్.

రాళ్లతో దాడి చేసిన వారు, కుట్రదారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా తన కథనంలో పేర్కొంది. ఫోటో, వీడియోల ఆధారంగా ఇప్పటివరకు పలువురిని అరెస్ట్ చేశామని కాన్పూర్ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ ఘటనలో పోలీసుల తప్పిదం ఉంటే కూడా చర్యలు తప్పవని చెప్పారు. హయత్ ఇంటి వద్ద సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా, క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పత్రాలు లభించాయి.

వెయ్యి మందిపై కేసు

వెయ్యి మందిపై కేసు


ఇప్పటికే 1000 మందిపై మూడు ఎఫ్ఐఆర్‌‌లు నమోదు చేశారు. ఇతిశామ్ కబడీ, జీశం, ఆకివ్, అజిజర్, అమీర్ జావేద్, ఇమ్రాన్ ఖలే, యూసుఫ్ మన్సూరీపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అల్లర్లలో పాల్గొన్న ప్రతీ ఒక్కరీని రెండు, మూడుర రోజుల్లో అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఇవాళ మార్కెట్ తెరిచారని.. పోలీస్ పెట్రోలింగ్ కొనసాగుతోందని వివరించారు.

ఇవీ కేసులు

ఇవీ కేసులు


అల్లర్లకు కారణమైన వారిపై గ్యాంగ్ స్టార్ యాక్ట్, ఆస్తుల నష్టం చట్టం విధిస్తామని తెలిపారు. శాస్త్రీయ, సాంకేతిక ఆధారంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. భద్రత కోసం పీఏసీ 12 కంపెనీలు, సీఏపీఎఫ్ 3 కంపెనీల సాయం తీసుకున్నామని తెలిపారు.

English summary
Kanpur Police have arrested a total of 29 people involved in the violence that erupted in the city’s Parade Chowk area on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X