‘హవాలా స్కాంలో సీఎం కేజ్రీవాల్’: మరో బాంబు పేల్చిన కపిల్ మిశ్రా

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: మాజీ మంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ బహిష్కృత నేత కపిల్‌ మిశ్రా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై మరో బాంబు పేల్చారు. హవాలాదారుల నుంచి ఆప్‌కు భారీగా నిధులు వచ్చాయని మిశ్రా ఆరోపించారు.

శుక్రవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మిశ్రా దీనికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేశారు. 'ఆయన అవినీతికి సంబంధించి ఆధారాలను బయటపెడుతున్నా కేజ్రీవాల్‌ మౌనంగా ఉంటున్నారు. డొల్ల కంపెనీల ద్వారా నిధులు తీసుకుంటున్నారని వారం క్రితం ఆధారాలతో సహా నిరూపించాను. కానీ ఆప్‌ నుంచి ఎవరూ ఎటువంటి వివరణ ఇవ్వలేదు..' అని వ్యాఖ్యానించారు.

ఆ లెటర్ హెడ్స్ నకిలీవి...

ఆ లెటర్ హెడ్స్ నకిలీవి...

హవాలా ఆపరేటర్ల దగ్గర నుంచి పార్టీకి నిధులు వచ్చాయని, ఏయే కంపెనీల నుంచి నిధులు వచ్చాయో చెబుతూ ఏ కంపెనీల లెటర్‌హెడ్స్‌ ఆధారాలుగా చూపుతున్నారో అవి నకిలీవని, ఆప్‌ వాటిని ఫోర్జరీ చేసిందని అని మిశ్రా ఆరోపించారు.

ఒక్కో కంపెనీ నుంచి రూ.50 లక్షలు...

ఒక్కో కంపెనీ నుంచి రూ.50 లక్షలు...

తూర్పు ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్త 2014లో ఆప్‌కు రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చినట్లు ఒప్పుకున్నాడు. ఆయనకు నాలుగు కంపెనీలు ఉన్నాయి. ఒక్కో కంపెనీ నుంచి రూ.50 లక్షలు ఇచ్చారు. ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ నుంచి కేజ్రీవాల్‌ రూ.2 కోట్లు ముడుపులు తీసుకోవడం నా కళ్లారా చూశానని మిశ్రా మొదటిసారిగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

బ్లాక్ ను వైట్ చేసేందుకు కేజ్రీవాల్ ప్రయత్నం...

బ్లాక్ ను వైట్ చేసేందుకు కేజ్రీవాల్ ప్రయత్నం...

అనంతరం 16 డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా నల్లధనాన్ని కేజ్రీవాల్‌ తెల్లధనంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని రెండోసారి ఆరోపణలు చేశారు. మరోవైపు మిశ్రా ఆరోపణలపై ఇప్పటి వరకు కేజ్రీవాల్‌ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. కానీ తన పరువుకు భంగం వాటిల్లిందంటూ మంత్రి జైన్‌.. కపిల్ మిశ్రాపై క్రిమినల్‌ పరువు నష్టం దావా వేశారు.

రుణ ఎగవేతదారు రూ.2 కోట్లు ఎలా ఇస్తారు?

రుణ ఎగవేతదారు రూ.2 కోట్లు ఎలా ఇస్తారు?

అయితే శుక్రవారం మిశ్రా ఆరోపణలు చేస్తూ.. ‘ముఖేశ్‌కుమార్‌ అనే వ్యక్తి దగ్గర నుంచి ఆప్‌కు డబ్బులు వచ్చాయి. ముఖేశ్‌ కంపెనీ ఓ బ్యాంకుకు రుణం ఎగవేసింది. అలాంటపుడు ఆ కంపెనీ నుంచి ఆప్‌కు రూ.2 కోట్లు ఎలా వచ్చాయి?' అని కపిల్ మిశ్రా ప్రశ్నంచారు.

ఒకరిని కప్పిపుచ్చేందుకు మరొకరు...

ఒకరిని కప్పిపుచ్చేందుకు మరొకరు...

అనేక కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్న హేమ్‌ప్రకాశ్‌ శర్మ గుర్తింపును కప్పిపుచ్చేందుకు ముఖేశ్‌ను అడ్డం పెట్టుకున్నారని, ముఖేశ్‌ కంపెనీ వ్యాట్‌ను ఎగవేసిందని, అందుకు బదులుగా ఢిల్లీ ప్రభుత్వానికి, ఆప్‌కు విరాళాలు ఇచ్చేలా ఒప్పందం చేసుకుందని, వీటన్నింటిపై సీఎం కేజ్రీవాల్‌ ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు'? అని కపిల్ మిశ్రా ప్రశ్నించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sacked Delhi minister Kapil Mishra today alleged that AAP chief Arvind Kejriwal is connected to a 'hawala' scam, or money laundering scheme. Mishra further alleged that Kejriwal is making a Delhi businessman Mukesh Kumar - referred to in a video as Mukesh Sharma - the fall guy, by getting him to falsely claim he donated Rs 2 crore to AAP. "This is all an elaborate ploy to launder money, to convert black money into white," Mishra alleged, adding that Kejriwal was the kingpin of this elaborate conspiracy.
Please Wait while comments are loading...