‘‘ఒక్కరోజు ఆగండి.. నేను చెప్పబోయే సీక్రెట్ తో ఢిల్లీ మొత్తం వణుకుద్ది..’’

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: తాను తర్వాత చెప్పబోయే మరో విషయం ఢిల్లీ ప్రజల్లో భూకంపం పుట్టిస్తుందని, ముఖ్యంగా ఎవరు ఆమ్‌ ఆద్మీ పార్టీపై నమ్మకం పెట్టుకున్నారో వారంతా వణికిపోతారని ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురై నిరహార దీక్షలో ఉన్న కపిల్‌ మిశ్రా వ్యాఖ్యానించారు.

శనివారం మహాత్మాగాంధీ స్మృతి వనం రాజ్‌ ఘాట్‌ను సందర్శించిన ఆయన అక్కడ కంటతడి పెట్టారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లంచం తీసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేసిన కపిల్‌ మిశ్రా ప్రస్తుతం పార్టీ నుంచి వేటుకు గురై నిరహార దీక్షలో ఉన్న విషయం తెలిసిందే.

Kapil Mishra warns Arvind Kejriwal of another big expose which will 'rattle' people's trust in AAP

బాపూ ఘాట్‌కు వెళ్లిన ఆయనను ఆరోగ్యం క్షీణించిందని, ఆస్పత్రిలో చేరాలని వైద్యులు సలహా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 'నేను ఒంటరినని భావిస్తున్నాను. అందుకే రాజ్‌ ఘాట్‌కు వచ్చాను..' అన్నారు.

'రేపు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళతా. అంతేకాదు, రేపు నేను మరో విషయాన్ని బయటపెడతా.. ఆ తర్వాత ఢిల్లీ ప్రజలు ప్రకంపనలు చూస్తారు. ముఖ్యంగా ఎవరు ఆప్‌ను నమ్మారో వారు' అని ఆయన అన్నారు. దీంతో రేపు కపిల్‌ మిశ్రా ఏం బయటపెట్టనున్నారో అని సర్వత్రా ఎదురు చూస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Axed Delhi minister Kapil Mishra, who is on an indefinite fast, today claimed his next "expose" will rattle the people of Delhi who "trusted the Aam Aadmi Party". During the day, Mishra visited the Raj Ghat, the memorial for Mahatma Gandhi, where he had made startling allegations of corruption against Kejriwal on Sunday. He broke down at the memorial.He has been sitting on an indefinite strike since Wednesday and was advised hospitalisation be a team of doctors today.
Please Wait while comments are loading...