మిన్ను విరిగి మీద పడ్డా.. వెన్ను చూపని BSF: జవాన్ల ధైర్య సాహసాలకు సెల్యూట్
కార్గిల్ విజయ్ దివస్.. భారత భూభాగంపైకి చొచ్చుకొచ్చిన శతృదేశ సైనికులను వారి సరిహద్దుల వరకూ తరిమికొట్టిన ఓ సందర్భం. సరిహద్దు భద్రత బలగాల దెబ్బకు శతృవులు తోకముడిచుకుని పారిపోయిన రోజు. ప్రతి భారతీయుడినీ నరనరాన ఉత్తేజితులను చేసే పండగ.
కార్గిల్ విజయ్ దివస్‌ను ప్రతి సంవత్సరం జూలై 26న జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 1999లో ఇదే రోజున.. భారత సైన్యం ఆపరేషన్ విజయ్ విజయవంతంగా ముగిసినట్లు ప్రకటించింది. టోలోలింగ్, టైగర్ హిల్ వంటి అత్యంత ఎత్తైన ప్రాంతాలలో దాదాపు మూడు నెలల పాటు జరిగిన యుద్ధం తర్వాత విజయం సాధించినట్లు తెలిపింది.

26వ కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఈ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు కార్గిల్ అమర వీరులకు నివాళి అర్పించారు. వారికి జోహార్లు అర్పించారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భారత సైనిక సాహసోపేతమైన పోరాట పటిమను, ఫిరంగుల మోతలను ప్రపంచం గుర్తు చేసుకుంది. అయితే- సరిహద్దు భద్రతా దళం (BSF) నిశ్శబ్ద పోరాటం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. దేశ సరిహద్దులను కాపాడటంలో ముందుండి నడిచే అత్యంత సాహసోపేతమైన బలగం ఇది. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా శత్రువును ధైర్యంగా ఎదుర్కొవడం దీని నైజం.
కార్గిల్ సెక్టార్ లోని ఎత్తైన ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ దళాలు మోహరించాయి. నియంత్రణ రేఖ (LoC) వెంబడి ఉన్న కీలక స్థావరాలను కాపాడుతూ, పాకిస్తాన్ చొరబాట్లు పూర్తిగా వెలుగులోకి రాకముందే, క్లిష్టమైన భూభాగాన్ని తమ ఆధీనంలో ఉంచుకున్నాయి. కక్సర్, చెన్నిగుండ్, చోర్బాట్ లా వంటి వ్యూహాత్మక ప్రాంతాల్లో- బీఎస్ఎఫ్ జవాన్లు కంటి మీద కునుకు లేకుండా పహారా కాస్తుంటారు.

సముద్ర మట్టానికి 17,000 నుండి 18,000 అడుగుల ఎత్తులో ఉంటాయా ప్రాంతాలు. క్షణక్షణానికి అక్కడి వాతావరణం మారుతుంటుంది. ఊహకు అందని విధంగా వాతావరణ పరిస్థితులు తలెత్తుతుంటాయి. అలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ చొరబాటును ఎదిరించి.. భారత భూభాగాన్ని కాపాడుకున్నారు బీఎస్ఎఫ్ జవాన్లు.
చలికాలంలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతుంటాయి.. కార్గిల్ సెక్టార్ లో. ఆక్సిజన్ స్థాయి క్షీణిస్తుంటుందక్కడ. అలాంటి చోట క్యాంపులు, అవుట్ పోస్టులను ఏర్పాటు చేసుకోవడం, విధులను నిర్వర్తించడం అనేది అసాధ్యమని చాలామంది భావిస్తారు. కానీ బీఎస్ఎఫ్ జవాన్లు మాత్రం మొక్కవోని ధైర్యంతో అక్కడ నిలిచారు. ఒక్క క్యాంప్ ను కూడా ఖాళీ చేయలేదు.
బీఎస్ఎఫ్ జవాన్ల అంకితభావానికి, ఓర్పుకు.. అన్నింటికీ మించి భరతమాత పట్ల వారికి ఉన్న భక్తిభావానికి ఇది నిలువెత్తు నిదర్శనం. చారిత్రాత్మక సిల్క్ రూట్ లో ఉన్న ముఖ్యమైన స్థావరం చోర్బాట్ లా. దీన్ని శత్రువులు స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించారు.. కార్గిల్ వార్ సందర్భంగా. అలా జరిగితే పాకిస్తాన్‌కు వ్యూహాత్మక ప్రయోజనం కలిగేది.
దీన్ని సమర్థవంతంగా అడ్డుకోగలిగింది బీఎస్ఎఫ్. కమాండెంట్ ఎస్ సీ నేగి నాయకత్వంలో బీఎస్ఎఫ్ బలగాలు శత్రువుల ప్రయత్నాలను తిప్పి కొట్టాయి. అంతేకాకుండా- తీవ్రమైన చలిలో కూడా బ్రావో-1 అనే ఎత్తైన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఆ ప్రాంతంపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాయి. ఇది- కార్గిల్ యుద్ధంపై పట్టును మరింత బలోపేతం చేసింది.
కార్గిల్ వార్ సందర్భంగా సైనికులు శత్రవుల తుపాకులు, ఫిరంగుల నుంచి వెలువడిన బుల్లెట్లను మాత్రమే కాదు- తీవ్రాతి తీవ్రమైన వాతావరణ పరిస్థితులను కూడా ఎదుర్కొన్నారు. ఎత్తైన ప్రదేశాల వల్ల వచ్చే అనారోగ్యాలు, మంచు గడ్డకట్టడం, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రమాదాలు నిత్యం పొంచి ఉండేవి.

అయినప్పటికీ వారి ధైర్యం ఏమాత్రం చెక్కుచెదరలేదు. దేశం పట్ల అచంచల నిబద్ధత ఇంచి కూడా తగ్గలేదు. ఎముకలు కొరికే చలికాలంలో కమాండెంట్ ఎస్ సీ నేగి.. సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్నప్పుడు.. అక్కడి బీఎస్ఎఫ్ జవాన్లకు పలు సూచనలు చేశారు. వాతావరణ పరిస్థితులు చాలా తీవ్రంగా ఉండటంతో వెనక్కి వెళ్లమని కోరారు.
బీఎస్ఎఫ్ జవాన్లు ఇచ్చిన సమాధానం స్ఫూర్తిదాయకం. "మా కమాండర్ ఇక్కడికి రాగలిగినప్పుడు, మేము ఎందుకు వెనక్కి వెళ్లాలి?" అని బదులిచ్చారు జవాన్లు. జవాన్లకు దేశభక్తిని కొలవడానికి ఇదొక్క మాటే చాలు.
అసిస్టెంట్ కంపెనీ కమాండర్ సోనం చెరింగ్ నాయకత్వంలో.. 8 నుంచి 10 మంది బీఎస్ఎఫ్ సిబ్బందితో కూడిన బృందం, శత్రువుల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురైనా LoC సమీపంలోని కీలక స్థానాలను సురక్షితంగా కాపాడింది. వారి ధైర్యంతో చోర్బాట్ లా ప్రాంతం భారత ఆధీనంలోకి వచ్చింది. చొరబాట్లకు అవకాశం లేకుండా పోయింది.
కార్గిల్ యుద్ధంలో బీఎస్ఎఫ్ దళాల సాహసోపేత చర్యలు.. శత్రువులపై భీకర ఎదురు దాడులు చేయడమో లేక సంచలనాత్మక విజయాలు సాధించడానికి పరిమితం కాలేదు. కోల్పోయిన భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించడం.. వారి మైండ్ గేమ్ కు అద్దం పట్టింది.
కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా- దేశం కోసం ప్రాణాలర్పించిన అమర వీరులను స్మరించుకుంటూ, దేశ గౌరవాన్ని కాపాడిన యోధులకు సెల్యూట్ చేస్తున్న ఈ సందర్భంలో బీఎస్ఎఫ్ త్యాగాలను వెలుగులోకి తీసుకురావాల్సిన సమయం ఇది. హిమాలయాల నీడలో వారి నిశ్శబ్ద సేవలు ఒక పటిష్టమైన కవచంలా దేశాన్ని కాపాడాయి. వారు గర్వంగా దేశాన్ని రక్షిస్తూనే ఉన్నారు. జై హింద్.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications