షాక్: బాటిల్ నీళ్లు తాగేసిన కింగ్ కోబ్రా: కలికాలం అంటే ఇదే (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: పాముల రారాజు'కింగ్ కోబ్రా'ను చూస్తే ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగు తీస్తారు. కింగ్ కోబ్రా కాటు వేస్తే దాదాపు 99 శాతం బతికే అవకాశం లేదని పెద్దలు అంటుంటారు. అలాంటి కింగ్ కోబ్రాను కర్ణాటకలో పట్టుకుని బాటిల్ తో నీళ్లు ఇస్తే గుటగుట తాగేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఉత్తర కర్ణాటకలోని కైగా ప్రాంతంలోని గ్రామంలోకి 12 అడుగుల పోడవు ఉన్న కింగ్ కోబ్రా వచ్చింది. విషయం గుర్తించిన మహిళలు, పిల్లలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగు తీశారు. కింగ్ కోబ్రా ఆ గ్రామంలో పలు చోట్ల సంచరించింది.

కింగ్ కోబ్రా కారణంగా మహిళలు, పిల్లల ప్రాణాలకు హానికలిగే అవకాశం ఉందని గుర్తించిన గ్రామాస్తులు దానిని ప్రాణాలతో పట్టుకోవడానికి ప్రయత్నించారు. చివరికి రాత్రి పూట రెండు గంటల పాటు కష్టపడి 12 అడుగుల కింగ్ కోబ్రాను పట్టుకున్నారు.

అయితే ఆ పాము కసితో అందరి మీద బుసకోట్టడం మొదలుపెట్టుంది. ఓ వ్యక్తి పాము తోకను పట్టుకున్నాడు. మరో వ్యక్తి ప్రాణాలకు తెగించి రెండు లీటర్ల వాటర్ బాటిల్ లోని నీళ్లు కింగ్ కోబ్రా మూతి దగ్గర పెట్టాడు. కింగ్ కోబ్రా స్వయంగా బాటిల్ ల్లోని నీళ్లు తాగుతున్న సమయంలో వీడియో తీశారు.

ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కింగ్ కోబ్రా స్వయంగా బాటిల్ ల్లోని నీళ్లు తాగడం చాల మందిని ఆశ్చర్యానికి గురి చేసిన వీడియో మీరే చూడండి. తరువాత కింగ్ కోబ్రాను అటవి శాఖ అధికారులకు అప్పగించడంతో దానిని క్షేమంగా సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
North Karnataka: The 12-foot snake was immediately given to drink water from a bottle by a villager who was cautious to not get to friendly, given its nature.
Please Wait while comments are loading...