కర్ణాటకలో శాసన సభకు ఎంఐఎం పోటీ, కాంగ్రెస్ పార్టీకి సినిమా, 60 సీట్లు, చర్చలు విఫలం!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: కర్ణాటకలో ఈ ఏడాది జరగనున్న శాసన సభ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ పోటీ చెయ్యడానికి రంగం సిద్దం అయ్యింది. ముస్లీంలు, దళితులు, మైనారీటీల జనాభా ఎక్కువగా ఉన్న 60 శాసన సభ నియోజక వర్గాల్లో పోటీ చెయ్యాలని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ నిర్ణయించారని తెలిసింది. ఇప్పటికే కర్ణాటకకు చెందిన ఎంఐఎం నాయకులు శాసన సభ ఎన్నికలపై దృష్టి సారించారు. ఎంఐఎం పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి సినిమా చూపించడానికి సిద్దం అయ్యింది.

కాంగ్రెస్ కు దెబ్బ

కాంగ్రెస్ కు దెబ్బ

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ముస్లీంలు, దళితులు, మైనారీల ఓటు బ్యాంకు కీలకం. గత శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ, దళితులు, ముస్లీంల ఓట్లతోనే అధికారంలోకి వచ్చిందని చెప్పడంతో ఎలాంటి సందేహం లేదు.

సీఎం సిద్దూకు షాక్

సీఎం సిద్దూకు షాక్

కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని ఎంఐఎం పార్టీ నిర్ణయించిందిని తెలుసుకున్న ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు షాక్ గురైనారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లీం, దళితుల ఓట్లు ఇప్పుడు చీలిపోయే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.

కర్ణాటక చీఫ్ క్లారిటీ

కర్ణాటక చీఫ్ క్లారిటీ

ఎంఐఎం కర్ణాటక శాఖ చీఫ్ అబ్దుల్ ఘని మాట్లాడుతూ ఉత్తర కర్ణాటకలో 28 శాసన సభ నియోజక వర్గాల్లో తన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని, ఇప్పటికే అనేక మంది పేర్లు పరిశీలించి ఓ నిర్ణయానికి వచ్చామని అన్నారు. దక్షిణ కర్ణాటకలో కూడా ఎంఐఎం పోటీ చేస్తోందని, మొత్తం 60 శాసన సభ నియోజక వర్గాల్లో కచ్చితంగా పోటీ చేస్తామని అబ్దుల్ ఘని స్పష్టం చేశారు.

ముస్లీంలు కాంగ్రెస్ ఆస్తి కాదు

ముస్లీంలు కాంగ్రెస్ ఆస్తి కాదు

ముస్లీంలు, దళితులు కాంగ్రెస్ పార్టీకే ఓటు వెయ్యాలని ఎక్కడ నియమాలు లేవని అబ్దుల్ ఘని అన్నారు. ముస్లీంలు, దళితులు మా ఆస్తి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు భ్రమపడుతున్నారని అబ్దుల్ ఘని ఎద్దేవ చేశారు.

ఇది ఎంఐఎం లెక్క

ఇది ఎంఐఎం లెక్క

కర్ణాటకలో 12 శాతం ముస్లీంలు ఉన్నారు. దళితులు 24 శాతం మంది ఉన్నారు. ఇక బీసీలు, మైనారీలను కలుపుకుని శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసి తమ సత్తా చాటాలని ఎంఐఎం నిర్ణయించింది. మొత్తం మీద శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడం కచ్చితంగా జరుగుతోందని ఎంఐఎం పార్టీ నాయకులు అంటున్నారు.

చర్చలు విఫలం !

చర్చలు విఫలం !

బెంగళూరులోని చామరాజపేట జేడీఎస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ ను సీఎం సిద్దరామయ్య పిలిపించి ఎంఐఎం నాయకులతో చర్చించాలని సూచించారు. ఈ ఏడాది జరిగే శాసన సభ ఎన్నికల్లో జమీర్ అహమ్మద్ కాంగ్రెస్ పార్టీ నుంచి చామరాజపేట నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ ఎంఐఎం నాయకులతో చర్చించినా ఫలితం లేదని తెలిసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
All set to contest in at least 60 seats in the upcoming Karnataka Assembly Elections, Asaduddin Owaisi's All India Majlis-e-Ittehadul Muslimeen (AIMIM) may just be Congress' new headache.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి