వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుప్పకూలిన బీజేపీ: యెడ్డీ రాజీనామా, కంటతడి, కుమారస్వామి ప్రమాణం తేదీ మారింది, కారణం ఇదే

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప శనివారం సాయంత్రం నాలుగు గంటలకు అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఆయన కాసేపు మాట్లాడి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విశ్వాస పరీక్షకు ముందే ఆయన రాజీనామా ప్రకటించారు. విశ్వాస పరీక్షలో గెలిచేందుకు ఏ ప్రయత్నాలు ఫలించకపోవడంతో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

చదవండి: అసెంబ్లీలో గెలిచినా.. యడ్యూరప్పకు షాకిచ్చేందుకు కాంగ్రెస్-జేడీఎస్ కొత్త ట్రంప్ కార్డ్

Karnataka Assembly (Half way mark- 109)
Total MLAs AbstainedPresent in Assembly
BJP1040104
CONGRESS78078
JDS+3800
OTHERS202
karnataka Assembly Floor Test Live Updates And Results

Newest First Oldest First
11:29 PM, 19 May

కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయం మారింది. తొలుత సోమవారం ప్రమాణం చేయాలనుకున్నారు. కానీ ఆ రోజు రాజీవ్ గాంధీ వర్ధంతి ఉన్న నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు స్వయంగా కుమారస్వామి తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 12.30 చేయనున్నారు.
7:46 PM, 19 May

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులతో పాటు మాయావతి, అఖిలేష్, స్టాలిన్, తేజస్వి యాదవ్, మమతా బెనర్జీలను కూడా ఆహ్వానించినట్లు చెప్పారు. తమ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి ఇచ్చారన్నారు. బీజేపీ ఆపరేషన్ మొత్తం తెలుసునని చెప్పారు. కాంగ్రెస్, జేడీఎస్ సమన్వయం కోసం సమన్వయ నియమించినట్లు చెప్పారు. కాగా, కుమారస్వామి కంఠీరవ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
7:42 PM, 19 May

బీజేపీ బలం నిరూపించుకోలేకపోయిందని కుమారస్వామి అన్నారు. ఆయన గవర్నర్‌తో భేటీ అయిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, జేడీఎస్‌లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని చెప్పారు. సోమవారం ప్రభుత్వ ఏర్పాటు ఉంటుందన్నారు. మంత్రుల ప్రమాణ స్వీకారానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు వస్తున్నారని చెప్పారు. చంద్రబాబు, కేసీఆర్‌లను ఆహ్వానించినట్లు చెప్పారు.
7:28 PM, 19 May

జేడీఎస్ అధినేత కుమారస్వామి రాజ్ భవన్‌కు చేరుకున్నారు. ఆయన గవర్నర్ వాజుబాయి వాలాను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. ఆయనకు జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిపి 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది.
7:03 PM, 19 May

శనివారం రాత్రి ఏడున్నర గంటలకు గవర్నర్ వాజుబాయి వాలాను జేడీఎస్ అధినేత కుమారస్వామి కలవనున్నారు. తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. కుమారస్వామి సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
6:30 PM, 19 May

జేడీఎస్ - కాంగ్రెస్ పార్టీలు షంగ్రిలా హోటల్లో భేటీ అయ్యారు. కేబినెట్ కూర్పుపై చర్చిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ కర్ణాటక అధ్యక్షులు పరమేశ్వరకు దక్కనుంది.
6:29 PM, 19 May

కుమారస్వామి సోమవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన ప్రమాణ స్వీకారానికి మమతా బెనర్జీని ఆయన ఆహ్వానించారు. తాను వస్తున్నట్లు ఈ మేరకు మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.
5:57 PM, 19 May

ఇది ప్రాంతీయ పార్టీ విజయమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఆమె అభినందనలు తెలిపారు. ఆర్జేడీ కూడా ఆ రెండు పార్టీలకు అభినందనలు తెలిపింది.
5:56 PM, 19 May

బీజేపీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేసి ఫెయిలైందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇప్పటికైనా బీజేపీ పాఠం నేర్చుకుంటుందా అని ప్రశ్నించారు.
5:55 PM, 19 May

కర్ణాటక గవర్నర్ వాజుభాయి వాలాకు రాజీనామా పత్రాన్ని సమర్పించిన యడ్యూరప్ప.
5:36 PM, 19 May

మాకు 117 మంది సభ్యుల బలం ఉందని, బీజేపీకి మెజార్టీ లేకున్నా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానించారని, బీజేపీ నేతల ప్రలోభాలను మా ఎమ్మెల్యేలు తిరస్కరించారని, ఇది ప్రజాస్వామ్య విజయమని గులాం నబీ ఆజాద్ అన్నారు.
5:32 PM, 19 May

యడ్యూరప్ప రాజీనామా అనంతరం ఢిల్లీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆనందం ఇలా ఉంది...
5:32 PM, 19 May

కర్ణాటక పరిణామాలు బీజేపీకి చెంపపెట్టు అని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. 2019 ఎన్నికలకు వారి ప్లాన్‌లు విఫలమవుతున్నాయన్నారు. ఇప్పుడు వారి వారి వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరముందని ఎద్దేవా చేశారు.
5:30 PM, 19 May

కర్ణాటకలో ప్రజాస్వామ్యం విజయం సాధించిందని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. బీజేపీ నియంతృత్వ, అవినీతికర అక్రమ పద్ధతులు ఓడాయన్నారు. రేపు రాష్ట్రమంతా ప్రజాస్వామ్య విజయోత్సవాలు జరుపుతామన్నారు.
5:30 PM, 19 May

యడ్యూరప్ప రాజీనామా ప్రజాస్వామ్య విజయమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు ఫలించాయన్నారు. ఈ విజయం 2019 ఎన్నికలకు పునాది అన్నారు. కర్ణాటకలో ప్రజాస్వామ్యం విజయం సాధించిందన్నారు.
5:11 PM, 19 May

ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేసిన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి అనంత్ కుమార్ మండిపడ్డారు. మోడీ అవినీతి, కుంభకోణాలు లేని ప్రభుత్వాన్ని ఇస్తున్నారన్నారు.
5:06 PM, 19 May

జేడీఎస్ అధినేత కుమారస్వామి సోమవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తోంది.
5:01 PM, 19 May

బీజేపీ నేత యడ్యూరప్ప రాజీనామా ప్రజాస్వామ్య విజయమని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ చెప్పారు. యెడ్డీ రాజీనామా అనంతరం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్యేలు జాతీయ గీతాన్ని అవమానించారని చెప్పారు.
4:54 PM, 19 May

యడ్యూరప్ప రాజీనామా అనంతరం డెహ్రాడూన్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.
4:53 PM, 19 May

కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలుపుతున్నామని, అలాగే బీఎస్పీ, స్వతంత్ర ఎమ్మెల్యేలకు కూడా శుభాకాంక్షలు అని గులాం నబీ ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
4:43 PM, 19 May

యడ్యూరప్ప రాజీనామా నేపథ్యంలో గవర్నర్ వాజుబాయి వాలా పిలుపు కోసం వేచి చూస్తున్నామని జేడీఎస్ అధినేత కుమారస్వామి వెల్లడించారు. మీరు ఎప్పుడు సీఎంగా ప్రమాణం స్వీకారం చేస్తారని మీడియా అడగగా ఆయన పైవిదంగా చెప్పారు.
4:37 PM, 19 May

తమ పార్టీల ఎమ్మెల్యేలు ఎవరూ ప్రలోభాలకు లొంగలేదని గులాం నబీ ఆజాద్ చెప్పారు. కర్ణాటకలో ప్రజాస్వామయం విజయం సాధించిందని చెప్పారు.
4:25 PM, 19 May

యడ్యూరప్ప గవర్నర్‌కు రాజీనామాను సమర్పించారు.
4:25 PM, 19 May

యడ్యూరప్ప రాజీనామా చేశారని తెలిసిందని, ప్రజాస్వామ్యవాదులంతా సంతోషంగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
4:20 PM, 19 May

యడ్యూరప్ప రాజ్ భవన్ బయలుదేరారు. ఆయన గవర్నర్ వాజుబాయి వాలాకు రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు. యెడ్డీ రాజీనామా నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు అసెంబ్లీలోనే డ్యాన్స్ చేశారు. కాంగ్రెస్ - జేడీఎస్ నేతలు సంబరాలు చేసుకున్నారు.
4:18 PM, 19 May

యడ్యూరప్ప రాజీనామా చేసిన నేపథ్యంలో గవర్నర్ జేడీఎస్ - కాంగ్రెస్ పార్టీలను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించనున్నారు. కాబోయే ముఖ్యమంత్రి కుమారస్వామి కానున్నారు. కాగా, అసెంబ్లీలో యడ్యూరప్ప కంటతడి పెట్టారు.
4:17 PM, 19 May

నేను ఇప్పుడు అధికారం మాత్రమే కోల్పోయానని, ఏమీ కోల్పోలేదని యడ్యూరప్ప చెప్పారు. 2019 లోకసభ ఎన్నికల్లో మేం 28 పార్లమెంటు స్థానాలకు 28 గెలుస్తామని చెప్పారు. యడ్యూరప్ప రాజీనామా నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారు.
4:15 PM, 19 May

ఎన్ని సీట్లు వచ్చాయన్నది ముఖ్యం కాదని, ప్రజలు ఎవరిని కోరుకున్నారన్నది ముఖ్యమని యడ్యూరప్ప చెప్పారు. కర్ణాటకపై ప్రధాని ఎప్పుడూ వివక్ష చూపలేదన్నారు. కర్ణాటకకు ఇప్పుడు నిబద్ధత కలిగిన నేతలు కావాలన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల కలయిక అపవిత్రమన్నారు. అసెంబ్లీలో యడ్యూరప్ప ఉద్వేగంతో మాట్లాడారు.
4:08 PM, 19 May

గడిచిన అయిదేళ్లలో తాను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని యెడ్డీ చెప్పారు. తాను రాజీనామా చేస్తున్నట్లు యడ్యూరప్ప ప్రకటించారు. ప్రజలు సుస్థిర పాలన కోరుకుంటున్నారని చెప్పారు. మేం అధికారంలోకి వస్తే వృద్ధాప్య, వితంతు పించన్లు పెంచాలనుకున్నామని, లక్ష రూపాయల వరకు రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఆశించామన్నారు.
4:03 PM, 19 May

తాను ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేశానని యడ్యూరప్ప చెప్పారు. చివరి ఊపిరి ఉన్నంత వరకు రైతుల కోసం పని చేస్తానని చెప్పారు. మా హయాంలో నీటి పారుదల కోసం లక్షన్నర కోట్లు కేటాయించామని చెప్పారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలను ప్రజలు తిరస్కరించారన్నారు. తాను రెండేళ్లుగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించానని చెప్పారు. గత ప్రభుత్వాల పాలన కారణంగా ప్రజల కళ్లల్లో బాధను చూశానన్నారు.
READ MORE

English summary
The Supreme Court said that the best way to decide this matter would be on the floor of the House. The court had earlier indicated that it wanted the test to be held on Saturday itself. This was however opposed to by Mukul Rohatgi who was arguing for the BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X