చెప్పులతో కొట్టి జయలలితకు పిండప్రదానం

బెంగళూరు: తమిళనాడు ముఖ్యమంత్రి తమ దృష్టిలో చచ్చిపోయారని, అందుకే సాంప్రదాయంగా పిండప్రదానం చేస్తున్నామని కన్నడ సంఘాల నాయకులు అన్నారు. బెంగళూరు నగరంలోని టౌన్ హాల్ దగ్గర పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు.

వేలాధి మంది కార్యకర్తలు ధర్నాలో పాల్గోన్నారు. ఇదే సందర్బంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత దిష్టి బొమ్మను ఊరేగింపుగా తీసుకు వచ్చారు. పురోహితులు జయలలిత దిష్టి బొమ్మ కు అంత్యక్రియలు నిర్వహించారు.

Karnataka bandh over Cauvery dispute

తరువాత దిష్టి బొమ్మను దహనం చేసి తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పురోహితులు హిందూ సాంప్రాదాయంతో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు పిండప్రదానం చేశారు.

కర్ణాటక ప్రజలు, రైతుల జీవితాలతో జయలలిత చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. అక్రమాస్తుల కేసులో జయలలిత మళ్లి కచ్చితంగా జైలుకు వెలుతారని జోస్యం చెప్పారు. పలు కన్నడ సంఘాల నాయకులు జయలలిత దిష్టి బొమ్మలను ఊరేగింపుగా తీసుకువచ్చి నడి రోడ్డులో దహనం చేశారు.

జయలలిత ఫోటో, ఫ్లక్సీలు ఏర్పాటు చేసి చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. కావేరి నీటి విషయంలో తాము పోరాటం చేస్తామని, ఇక్కడి రైతులు, ప్రజలను ఆదుకుంటామని కన్నడ సంఘాల నాయకులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+