వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడల్ రేఖ సింధు చేతులు, కాళ్లు ముక్కలు, హత్య చేశారని తండ్రి, మరో నటి ఇలా !

ఆంధ్రా సరిహద్దులోని వేలూరు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన ప్రముఖ మోడల్ రేఖ సింధు కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమె కాళ్లు, చేతులు తెగిపోయాయని, హత్య చేశారని తమిళనాడు పోలీసులకు ఫిర

|
Google Oneindia TeluguNews

వేలూరు/చెన్నై/బెంగళూరు: ప్రముఖ మోడల్, బుల్లితెర నటి రేఖ సింధు మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోడ్డు ప్రమాదంలో రేఖ సింధు చనిపోలేదని, హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసిన ఆమె కుటుంబ సభ్యులు తమిళనాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

<strong>ఆంధ్రా సరిహద్దులో ప్రముఖ మోడల్, నటి రేఖ సింధుతో సహ నలుగురి దుర్మరణం!</strong>ఆంధ్రా సరిహద్దులో ప్రముఖ మోడల్, నటి రేఖ సింధుతో సహ నలుగురి దుర్మరణం!

కన్నడ బుల్లితెర నటి రేఖ సింధు (22) శుక్రవారం ఉదయం ఆంధ్రా సరిహద్దులోని వేలూరు సమీపంలోని నేట్రాంపల్లి దగ్గర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారని పోలీసులు అంటున్నారు. రేఖతో పాటు కారులో ప్రయాణిస్తున్న ఆమె స్నేహితులు అభిషేక్ కుమరన్ (22), జయచంద్రన్ (23), రక్షన్ (20) ఇదే ప్రమాదంలో మరణించారు.

నిత్యం రద్దీగా ఉండే రహదారి

నిత్యం రద్దీగా ఉండే రహదారి

బెంగళూరు-చెన్నై జాతీయరహదారిలోని నేట్రాంపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటకతో పాటు మదనపల్లి, కడప, చిత్తూరు నుంచి చెన్నై వెళ్లాలంటే ఇదే రహదారి నుంచి వెళ్లాలి. ప్రతినిత్యం వాహన సంచారంతో ఈ జాతీయ రహదారి ఎంతో రద్దీగా ఉంటుంది.

రోడ్డు డివైడర్ ను ఢీకొంటే ?

రోడ్డు డివైడర్ ను ఢీకొంటే ?

తమిళనాడులోని వేలూరు జిల్లా పోలీసుల కథనం మేరకు రేఖ సింధు ప్రయాణిస్తున్న కారు నెంబర్ టీఎన్ 32, ఏఎక్స్ 6666 వాహనం రోడ్డు డివైడర్ ను ఢీకొనడంతో ఆమె సంఘటనా స్థలంలొనే దుర్మరణం చెందారని సమాచారం. ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మరో ముగ్గరు యువకులు మరణించారని అంటున్నారు.

రోడ్డు ప్రమాదం అయితే

రోడ్డు ప్రమాదం అయితే

బెంగళూరు నుంచి వేలూరు చేరుకున్న రేఖ సింధు తల్లిదండ్రులు, ఆమె సోదరి అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రేఖ సింధు రెండు కాళ్లు, చేతులు విరిగిపోయాయని, ఇది రోడ్డు ప్రమాదం కాదని అంటున్నారు. ప్రమాదం జరిగితే శరీరం మొత్తం నుజ్జునుజ్జు కావాలి కాని కాళ్లు, చేతులు మాత్రమే ఏలా విరిగిపోతాయని ప్రశ్నిస్తున్నారు.

చంపేశారు, అనుమానం ఉంది !

చంపేశారు, అనుమానం ఉంది !

రేఖ సింధును చంపేశారని మాకు అనుమానం ఉందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రేఖ సింధు మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రేఖ సింధును హత్య చేశారని వారు ఆరోపించడంతో తమిళనాడు పోలీసులు ఆకోణంలో విచారణ చెయ్యడానికి సిద్దం అయ్యారు.

బెంగళూరు నుంచి తరలి వెళ్లిన మోడల్స్

బెంగళూరు నుంచి తరలి వెళ్లిన మోడల్స్

రేఖ సింధు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని తెలుసుకున్న సాటి బుల్లితెర నటీనటులు, మోడల్స్, ఆమె స్నేహితులు వేలూరు చేరుకున్నారు. రేఖ సింధును చూసి చలించిపోయారు. ఎంతో అందంగా ఉన్న రేఖ సింధు చివరికి ఇలా మరణించారని తెలుసుకుని విచారం వ్యక్తం చేస్తున్నారు.

రేఖ సింధు బదులు రేఖ క్రిష్ణప్ప

రేఖ సింధు బదులు రేఖ క్రిష్ణప్ప

రేఖ సింధు పలు తమిళ, కన్నడ టీవీ సీరియల్స్, కమర్షియల్ యాడ్స్ లో నటించారు. కర్ణాటకు చెందిన రేఖ క్రిష్ణప్ప అలియాస్ రేఖ కుమారి సైతం తమిళ, కన్నడ టీవీ సీరియల్స్ లో నటించారు. అయితే కొన్ని మీడియా చానల్స్ లో రేఖ సింధు ఫోటోకు బదులు రేఖ క్రిష్ణప్ప ఫోటో చూపించి ఈమే ప్రమాదంలో మరణించారని వార్తలు ప్రసారం చెయ్యడంతో గందరగోళం నెలకొంది.

రేఖ క్రిష్ణప్పకు ఫోన్ల మీద ఫోన్లు

రేఖ క్రిష్ణప్పకు ఫోన్ల మీద ఫోన్లు

మీడియాలో విషయం తెలుసుకున్న రేఖ క్రిష్ణప్ప సన్నిహితులు, సాటి నటీనటులు ఆమెకు ఫోన్లు చేశారు. విషయం తెలుసుకున్న రేఖ క్రిష్ణప్ప సైతం షాక్ కు గురైనారు. తాను క్షేమంగానే ఉన్నానని రేఖ క్రిష్ణప్ప క్లారిటీ ఇవ్వడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు.

ఒకరు మృత్యువు ఒడిలో, ఒకరు దేవుడి సన్నిధిలో

ఒకరు మృత్యువు ఒడిలో, ఒకరు దేవుడి సన్నిధిలో

శుక్రవారం ఉధయం తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో రేఖ సింధు మృతి చెందారు. అదే సమయంలో కర్ణాటకలోని శృంగేరిలోని శారదాంభ ఆలయంలో రేఖ క్రిష్ణప్ప కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శం చేసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న రేఖ క్రిష్ణప్ప తాను క్షేమంగా ఉన్నానని స్నేహితులకు సమాచారం ఇచ్చారు.

చివరికి సోషల్ మీడియాలో

చివరికి సోషల్ మీడియాలో

రేఖ సింధు, రేఖ క్రిష్ణప్ప పేర్ల విషయంలో తికమకకు గురైన చాల మంది రేఖ క్రిష్ణప్పకు ఫోన్లు చేశారు. చివరికి ఆమె తాను శృంగేరిలోని శారదాంభ ఆలయం దగ్గర ఉన్నానని ఆలయం ముందు నిలబడి మాట్లాడుతూ ఓ వీడియో తీసి ఆ క్లిప్పింగ్ ఫేస్ బుక్ లో పోస్టు చెయ్యడంతో వదంతులకు తెరపడింది.

English summary
Karnataka based model Rekha Sindhu's father has raised doubts over his daughter's death in the accident. Kannada Actress Rekha Krishnappa clarified the news around her death saying that she is alive and fine. Rekha posted a video on the social media and said that there were reports of her death but she is sound and is in Sharada Petta temple.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X