బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Leader: లీడర్ హత్య, పక్కరాష్ట్రంలో అరెస్టు, ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్ ?, సీఎం, ఎన్ఐఏ దెబ్బతో !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/కాసరగూడు: బీజేపీ నాయకుడు ప్రవీణ్ హత్య కేసును మేము సాదారణ హత్య కేసుగా బావించడంలేదని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. ఇప్పటికే సీఎం బసవరాజ్ బోమ్మయ్ తో పాటు కర్ణాటక హోమ్ మంత్రి, కేంద్ర మంత్రులు బీజేపీ నాయకుడి హత్య కేసు ఖండించారు. కర్ణాటకను కుదిపేసిన బీజేపీ యువమోర్చ నాయకుడి హత్య కేసులో పోలీసులు ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్టు చేశారు. అరెస్టు అయిన నిందితులు బీజేపీ నాయకుడి హత్యకు స్కెచ్ వేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. బీజేపీ నాయకుడి హత్య కేసుతో అనేక మందికి సంబంధాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం అయ్యాయి. ఇదే సమయంలో బీజేపీ నాయకుడు ప్రవీణ్ హత్య కేసు ఎన్ఐఏ చేతికి వెళ్లిపోయింది. ఇదే సందర్బంలో బీజేపీ నాయకుడు ప్రవీణ్ హత్య కేసులో కేరళలో ఓ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రవీణ్ హత్య కేసులో ఇప్పటి వరకు ముగ్గురు అరెస్టు అయ్యారు. కర్ణాటక బీజేపీ నాయకుడు ప్రవీణ్ హత్య కేసుకు కేరళలోని కొంత మందికి సంబంధం ఉందని వెలుగు చూడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Illegal affair: భర్త పోలీసు, ప్రియుడు రొమియో, డ్యాన్స్ టీచర్ ఏం చేసిందంటే?, ఇద్దరూ!Illegal affair: భర్త పోలీసు, ప్రియుడు రొమియో, డ్యాన్స్ టీచర్ ఏం చేసిందంటే?, ఇద్దరూ!

 కసితో పక్కాస్కెచ్ తో నరికి చంపేశారు

కసితో పక్కాస్కెచ్ తో నరికి చంపేశారు

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని సూళ్య తాలుకాలోని బెళ్లారే పట్టణంలో ప్రవీణ్ నెట్టూరు అలియాస్ ప్రవీణ్ (29) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. దక్షిణ కన్నడ జిల్లా బీజేపీ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ బెళ్లార పట్టణంలోని బెరువాజీ క్రాస్ లో కోళ్ల అంగడి నిర్వహిస్తూ వ్యాపారం చేస్తున్నాడు. కేరళ రాష్ట్రంలో రిజిస్టర్ అయిన బైక్ లో వెళ్లిన ముగ్గురు వ్యక్తులు బీజేపీ నాయకుడు ప్రవీణ్ మీద వేటకొడవళ్లతో దాడి చేసి అతన్ని వెంటాడి వెంటాడి నరికి చంపేశారు.

 బీజేపీ నాయకుడి హత్యకు నిరసనలు

బీజేపీ నాయకుడి హత్యకు నిరసనలు

వేలాది మంది బీజేపీ కార్యకర్తలు, ప్రవీణ్ కుటుంబ సభ్యులు, స్నేహితులు అతని అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ప్రవీణ్ అంతిమ యాత్ర సందర్బంగా కొందరు యువకులు రాళ్ల వర్షం కురిపించారు. ఆ సందర్బంలో రాళ్లతో దాడులు చెయ్యకూడదని పోలీసులు మనవి చేసినా కొందరు పట్టించుకోలేదు. ఆ సందర్బంలో పోలీసులు లాఠీలను పని చెప్పడంతో అనేక మందికి తీవ్రగాయాలైనాయి.

 ఇద్దరు నిందితులు అరెస్టు

ఇద్దరు నిందితులు అరెస్టు

కర్ణాటకను కుదిపేసిన బీజేపీ యువమోర్చ నాయకుడు ప్రవీణ్ హత్య కేసులో పోలీసులు ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్టు చేశారు. సవణూరుకు చెంది జాకీర్, హత్యకు గురైన ప్రవీణ్ ఊరు బెళ్లారేలో నివాసం ఉంటున్న షఫిక్ అనే ఇద్దరు నిందితులు బీజేపీ నాయకుడు ప్రవీణ్ హత్యకు స్కెచ్ వేశారని పోలీసులు అన్నారు.

 మొదటి నుంచి అనుమానం

మొదటి నుంచి అనుమానం

ప్రవీణ్ ను మరో ఇద్దరు హత్య చేశారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే బీజేపీ నాయకుడి హత్య కేసులో ఇద్దరిని అరెస్టు చేశామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. బీజేపీ నాయకుడు ప్రవీణ్ హత్య కేసుకు, కేరళలోని కొన్ని సంఘాలకు సంబంధాలు ఉన్నాయని హిందూ సంఘాలు మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కోణంలో పోలీసు అధికారులు విచారణ ముమ్మరం చేశారు.

 కేరళలో అరెస్టు

కేరళలో అరెస్టు

బీజేపీ నాయకుడు ప్రవీణ్ హత్య కేసులో మంగళూరు పోలీసులు కేరళలోని తలసేరిలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కేరళలో మూడో వ్యక్తి అరెస్టు కావడంతో కథ మరోమలుపు తిరిగింది. ఇప్పటికే ఝాకీర్, షఫిక్ ను అదుపులోకి తీసుకున్న పోలీసు అధికారులు ఇద్దరిని విచారణ చేసి వాళ్లు ఇచ్చిన సమాచారం మేరకు కేరళలోని తలసేరిలో మరో వ్యక్తిని అరెస్టు చేశారని సమాచారం. అయితే కేరళలో అరెస్టు అయిన వ్యక్తి పేరు, వివరాలు చెప్పడానికి పోలీసు అధికారులు నిరాకరిస్తున్నారు.

English summary
Karnataka BJP leader Praveen Nettaru murder case, Kerala based suspected arrested near Mangaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X