కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే కారు ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం, విహారయాత్రలో విషాదం!
బెంగళూరు: కర్ణాటకలోని చిక్కమంగళూరు శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సీటీ. రవి ప్రయాణిస్తున్న కారు ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. రోడ్డు పక్కన నిలబడి ఉన్న రెండు కార్లను ఎమ్మెల్యే కారు ఢీకొనడంతో వాటిని బీజేపీ ఎమ్మెల్యే సీటీ రవి కారు డీకొనింది.
తుమకూరు జిల్లా కుణిగల్ సమీపంలోని ఉకేనహళ్ళి సమీపంలోని జాతీయ రహదారి 75లో మంగళవారం వేకువ జామున ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. 12 మంది యువకులు రెండు కార్లలో కర్ణాటకలో విహారయాత్రకు బయలుదేరారు.

మంగళవారం వేకువ జామున యువకులు రెండు కార్లు ఉకేనహళ్లి జాతీయ రహదారిలో రోడ్డు పక్కన నిలిపి మూత్రవిసర్జన చెయ్యడానికి నిలబడి ఉన్నారు. అదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యే సీటీ రవి ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన నిలబడి ఉన్న రెండు కార్లను ఢీకొనింది.
ఈ ప్రమాదంలో శశికుమార్, సునీల్ అనే ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మరో యువకుడికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో సీటీ. రవికి చిన్నచిన్న గాయాలైనాయని పోలీసులు అంటున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బీజేపీ ఎమ్మెల్యే సీటీ. రవి పోలీసులకు సమాచారం ఇచ్చి తరువాత వేరే కారులో బెంగళూరు వెళ్లారని పోలీసులు అంటున్నారు. బీజేపీ ఎమ్మెల్యే సీటీ. రవి ప్రయాణిస్తున్న కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బీజేపీ ఎమ్మెల్యే సీటీ. రవి కారు అక్కడి నుంచి పక్కకు తొలగించారని ఆరోపణలు ఉన్నాయి.
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications