Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కీలక మంత్రి పదవులపై కాంగ్రెస్, జేడీఎస్ పట్టు, ఢిల్లీలో పంచాయితీ, ఐదు శాఖలు, హామీ!

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం మంత్రివర్గం ఏర్పాటు చెయ్యడానికి ఢిల్లీలో చర్చలు జరుపుతున్నారు. ఢిల్లీలోని గులామ్ నబి ఆజాద్ ఇంటిలో కుమారస్వామి, సిద్దరామయ్య, పరమేశ్వర్ తదితరులు చర్చల్లో నిమగ్నం అయ్యారు. అయితే కీలక శాఖలు మాకు కావాలంటే మాకు కావాలి అంటూ కాంగ్రెస్-జేడీఎస్ నేతలు పట్టుబడుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక శాఖ విషయంలో ఇరు పార్టీల నేతల మధ్య తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఐదు శాఖలు ఎవరికి ఇవ్వాలి అనే విషయంలో ఇంకా చర్చలు పూర్తికాలేదు.

2004లో ఒప్పందం

2004లో ఒప్పందం

2004లో కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. ఆ సందర్బంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవి తీసుకుని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖను జేడీఎస్ కు ఇచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి మీకు వదలిపెట్టామని, ఉప ముఖ్యమంత్రితో పాటు ఆర్థిక శాఖ తమకు ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

సీఎం పట్టు

సీఎం పట్టు

ముఖ్యమంత్రి పదవి తరువాత అంత ప్రాముఖ్యం ఉన్న ఆర్థిక శాఖ కోసం ఇరు పార్టీల నాయకులు పట్టుబడుతున్నారు. ఆర్థిక శాఖను తన వద్దే పెట్టుకోవాలని హెచ్.డి. కుమారస్వామి పట్టుబడుతున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చామని, వాటిని నెరవేర్చాలంటే ఆర్థిక శాఖ తన వద్దే ఉండాలని కుమారస్వామి పట్టుబడుతున్నారని సమాచారం.

డీకే శివకుమార్

డీకే శివకుమార్

విద్యుత్ శాఖ మాకే కావాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా పని చేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జారిపోకుండా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడంలో కీలపాత్ర పోషించిన డీకే. శివకుమార్ కు మళ్లీ అదే శాఖ కేటాయించి కేపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని ఆ పార్టీ నాయకులు నిర్ణయించారు.

సీనియర్ నాయకులు

సీనియర్ నాయకులు

గతంలో జన వనరులు శాఖ మంత్రిగా పని చేసిన ఎంబి. పాటిల్ మళ్లీ తనకు అదే శాఖ కావాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకుడు, గతంలో పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేసిన ఆర్.వి. దేశ్ పాండే తనకు మళ్లీ అదే శాఖ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్థిక, హోం శాఖ, విద్యుత్, జన వనరులు, పరిశ్రమల శాఖలతో పాటు ప్రజా పనుల శాఖ మాకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.

కీలక శాఖలపై కసరత్తు

కీలక శాఖలపై కసరత్తు

కాంగ్రెస్ కు 22, జేడీఎస్ కు 12 మంత్రి పదవులు తీసుకోవడానికి సంకీర్ణ ప్రభుత్వంలో ఒప్పందం కుదిరింది. అయితే కీలకశాఖల కేటాయింపు విషయంలో ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కీలక శాఖలు మాకు కావాలంటే లేదు మాకు కావాలి అంటు ఇరు పార్టీల నాయకులు పోట్లాడుకుంటున్నారని సమాచారం. పైకిమాత్రం మంత్రి పదవుల పంపకంలో ఎలాంటి అభిప్రాయ విభేదాలు లేవని చెప్పినా లోపల మాత్రం నాయకులు కీలక శాఖల పంపిణి విషయంలో ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారని సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+