లక్ష మంది తమిళులు పరార్: మళ్లీ ఆ సీన్ వద్దు !
బెంగళూరు: కావేరీ జలాల పంపిణి విషయంలో తమిళనాడు ప్రభుత్వం ఇలానే వ్యవహరిస్తే 1991లో జరిగిన పరిణామాలు మళ్లీ రిపీట్ అవుతుందని కొన్ని కన్నడ సంఘాల కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. మండ్య జిల్లా అన్నదాతలు పంటలు ఎండిపోయి నష్టపోతున్నారని అంటున్నారు.
బెంగళూరు నగర ప్రజలకు తాగునీరు అందించే కావేరీ జలాలను తమిళనాడుకు వదిలి పెట్టి తాము ఇక్కడ ఏ నీరు తాగాలి అని తమిళనాడు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బెంగళూరు నగరంలో లక్షలాధి మంది తమిళులు ఉన్నారని తమిళనాడు ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు.

1991లో బెంగళూరులో
1991లో ఇదే విధంగా తమిళనాడు కన్నడిగులను రెచ్చగొట్టిందని అప్పుడు కన్నడిగులు తమిళులకు తగిన బుద్ది చెప్పిన విషయం గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. 1991లో బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలో కావేరీ జలాల పంపిణి విషయంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి.

రెండు లక్షల మంది తమిళులు
బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్న దాదాపు రెండు లక్షల మంది తమిళులు తమిళనాడుకు వెళ్లిపోయారు. తరువాత అల్లర్లు సర్దుమనిగిన తరువాత లక్ష మంది తమిళులు మళ్లీ బెంగళూరు చేరుకున్నారు.

మళ్లీ ఆసీన్ వద్దు
లక్ష మంది తమిళులు తమిళనాడులోనే ఉండిపోయారు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి ఎదురౌతుందని తమిళ ప్రజలు హడలిపోతున్నారు. గత 10 రోజుల నుంచి బెంగళూరులో అల్లర్లు, ఆందోళనలు జరుగుతున్నాయి. తమిళనాడుకు చెందిన అనేక వాహనాలు బూడిద అయ్యాయి.

రంగంలోకి మిలటరీ బలగాలు
మిలటరీ బలగాలు, పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థి అదుపులోకి వచ్చింది. అప్పటికే పోలీసుల కాల్పుల్లో ఒకరు, పోలీసుల లాఠీచార్జ్ నుంచి తప్పించుకోవడానికి భవనం మీద నుంచి కిందపడి ఒకరు ప్రాణాలు విడిచారు.

బెంగళూరులో 144 సెక్షన్
బెంగళూరు నగరంలో ఇప్పటికీ 144 సెక్షన్ అమలులో ఉంది. బెంగళూరు నగరంలోని సున్నితమైన ప్రాంతాల్లో మిలటరీ బలగాలు మొహరిస్తున్నాయి. మంగళవారం సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన తరువాత పోలీసులు మరింత కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.

సీఎం ఇంటి దగ్గర బందోబస్తు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇంటి దగ్గర, అధికార నివాసం దగ్గర భారీ సంఖ్యలో పోలీసు బలగాలు మొహరించాయి. పలువురు కన్నడ సంఘాల ప్రతినిధుల దినచర్యలపై పోలీసులు నిఘా వేశారు.

ఆందోళనలు
బెంగళూరు నగరంతో సహ మండ్య, మైసూరు, చామరాజనగర జిల్లాల్లో ఆందోళనలు ఎక్కువ అయ్యాయి. ముందు జాగ్రత్త చర్యగా తమిళ ప్రజలు ఎక్కువగా నివాసం ఉండే ప్రాంతాల్లో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు.

రెచ్చగొడితే అంతు చూస్తాం
ఎవరైనా ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఉండమని పోలీసు అధికారులు హెచ్చరించారు.

వాహన సంచారం బంద్
కర్ణాటక-తమిళనాడు రాష్ట్రాల మధ్య వాహన సంచారం పూర్తిగా స్థంభించింది.వాహన సంచారం రద్దు కావడంతో రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు, వ్యాపారాలు దెబ్బతిన్నాయి.












Click it and Unblock the Notifications