Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆంధ్రా బార్డర్ లో ఎంట్రీ ఇచ్చిన చాలెంజింగ్ స్టార్, నిన్న ఈగ. నేడు కురుక్షేత్రం !

బెంగళూరు/కేజీఎఫ్: కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి, కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నది. స్యాండిల్ వుడ్ లో వెండి తెరమీద నువ్వానేనా అంటూ పోటీపడే ఇద్దరు స్టార్ హీరోలు ఇప్పుడు బీజేపీ తరపున ప్రచారం చేస్తున్నారు.

తమ అభిమాన హీరోలు బీజేపీ తరపున ప్రచారం చెయ్యడానికి రోడ్ షోలు నిర్వహించడంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ రోడ్ల మీదకు వస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ తరపున ఇప్పటికే ఎన్నికల ప్రచారం చేస్తున్న స్టార్ హీరో సుదీప్ రోడ్ షోలకు ప్రజలు, ఆయన అభిమానులు ఊహించని విదంగా ఎగబడుతున్నారు.

Darshan who started road shows and election campaign

స్యాండిల్ వుడ్ చాలెంజింగ్ స్టార్, డీబాస్, స్టార్ హీరో దర్శన్ కూడా శుక్రవారం నుంచి బీజేపీ తరుపున ఎన్నికల ప్రచారం చెయ్యడానికి రంగంలోకి దిగారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కేజీఎఫ్ నుంచి చాలెంజింగ్ స్టార్ దర్శన్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టడం హాట్ టాపిక్ అయ్యింది, తమిళ ఓటర్లు ఎక్కువగా ఉన్న కేజీఎఫ్ లోనే చాలెంజింగ్ స్టార్ దర్శన్ రోడ్ షో నిర్వహించారు.

శుక్రవారం ఉదయం 10 గంటలకే హీరో దర్శన్ రోడ్ షోలో ప్రజల ముందు ప్రత్యక్షం అయ్యారు. స్యాండిల్ వుడ్ హీరో దర్శన్ రోడ్ షోలకు ఊహించని రెస్పాన్స్ రావడంతో బీజేపీ నాయకులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కేజీఎఫ్ లో రోడ్ షో పూర్తి అయిన తరువాత దర్శన్ రోడ్ షోలకు రూట్ మ్యాప్ సిద్దం చేసిన బీజేపీ నాయకులు రోడ్ షోలు సక్సస్ కావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

Darshan who started road shows and election campaign

కోలారు జిల్లాలోని కేజీఎఫ్ లో రోడ్ షో పూర్తి అయిన తరువాత అదే జిల్లాలోని బంగారుపేట, తరువాత కోలారు పట్టణంలో బీజేపీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేసి రోడ్ షోలో పాల్గొంటారు. తరువాత కోలారు జిల్లాలోని మాలూరులో బీజేపీ అభ్యర్థి తరుపున ప్రచారం చేస్తున్న హీరో దర్శన్ సాయంత్రం బెంగళూరు గ్రామీణ జిల్లాలోని హోస్ కోటే చేరుకుంటారు.

వేల కోట్ల రూపాయలకు అధిపతి అయిన కర్ణాటక మంత్రి ఎంటీబీ నాగరాజ్ ను గెలిపించాలని హోస్ కోటేలో రోడ్ షో నిర్వహించి ఎన్నికల ప్రచారం చేసిన తరువాత హీరో దర్శన్ అటునుంచి నేరుగా బెంగళూరు గ్రామీణ జిల్లాలోని విజయపురలో రోడ్ షోలో పాల్గొని బీజేపీ అభ్యర్థి తరుపున ప్రచారం చేస్తారు.

విజయపుర నుంచి దేవనహళ్లికి వెళ్లి అక్కడి బీజేపీ అభ్యర్ధి తరుపు హీరో దర్శన్ ప్రచారం చెయ్యనున్నారు. దేవనహళ్లిలో ఎన్నికల ప్రచారం ముగించుకున్న తరువాత హీరో దర్శన్ నేరుగా దొడ్డబళ్లాపురలో బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తారు. దొడ్డబళ్లాపురం నుంచి నేరుగా నెలమంగల వెలుతున్న హీరో దర్శన్ అక్కడ బీజేపీ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారం చేశారు. ఒకే రోజు 9 అసెంబ్లీ నియోజక వర్గాల్లో చాలెంజింగ్ స్టార్ దర్శన్ బీజేపీ తరుపున ఎన్నికల ప్రచారం చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+