యాపిల్ సగం తిని జనంలోకి విసిరేసిన డీకే శివకుమార్, నెటిజెన్స్ ఫైర్ (వీడియో)..!!
కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీరు పై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజులకే డీకే పై కొత్త చర్చ మొదలైంది. కేబినెట్ లో మంత్రుల నుంచి వచ్చిన చిక్కులను డీకే పరిష్కరించుకున్నారు. తొలి కేబినెట్ భేటీలోనే కీలక నిర్ణయాలతో తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, తన సొంత నియోజకవర్గంలో తాజాగా డీకే తీరు వివాదాస్పదంగా మారింది. ఇప్పుడు ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీరు వివాదాస్పదంగా మారింది. ముఖ్యమంత్రిగా బాధ్యతల స్వకరణ తరువాత తొలి సారి డీకే శివకుమార్ తన సొంత నియోజకవర్గం కనకపురకు భారీ ర్యాలీతో చేరుకున్నారు. ఆ సమయంలో అభిమానులు సీఎంకు క్రేన్లు ఏర్పాటు చేసి భారీ యాపిల్ పండ్ల దండ ను కానుకగా అందించారు. ఆ సమయంలో అభిమానుల నినాదాల నడుమ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తనకు అందించిన దండ నుంచి యాపిల్స్ ను తీసి సగం తిని.. మిగిలిన పండు ను అభిమానుల పైన అక్కడ ఉన్న జనాల మధ్య విసిరారు. అభిమానులు ఆ యాపిల్స్ కోసం ఎగబడ్డారు. వీడియో కాస్తా వైరల్ కావడంతో సీఎం డీకే శివకుమార్ లక్ష్యంగా విమర్శలు మొదలయ్యాయి.

సోషల్ మీడియాలో విమర్శలు
https://twitter.com/KeypadGuerilla/status/2064192531617960353
ముఖ్యమంత్రికి అభిమానంతో యాపిల్స్ దండ ఇస్తే ఇలా చేయటం ఏంటని నెటిజెన్లు వరుసగా ప్రశ్నలు సంధిస్తున్నారు. సీఎం అయినంత మాత్రాన ఈ రకంగా ప్రవర్తిస్తారా అంటూ నిలదీత కొనసాగుతోంది ఇది అహంకారానికి పరాకాష్ట అని, ప్రజలను అవమానించడమేనని నెటిజన్లు మండిపడ్డారు. ఐతే అభిమానులు మాత్రం తమ అభిమాన నాయకుడు పండు కొరికి ఇస్తే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారం జాతీయ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. అయితే, కనకపురా లో డీకే శివకుమార్ కు భారీగా అభిమానగణం ఉందని.. వారితో ఉన్న సన్నిహిత సంబంధాలతోనే ఇలా చేసారని మద్దతు దారులు సమర్ధించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా డీకే తాజా వ్యవహార శైలి పైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.













Click it and Unblock the Notifications