కీచకులకు కళ్లెం, మహిళలపై దౌర్జన్యాలకు చెక్: రంగంలోకి పింక్ హోస్సళ!
బెంగళూరు: ఐటీ, బీటీ సంస్థలకు ప్రసిద్ది చెందిన బెంగళూరు నగరంలో యువతులు, మహిళల మీద జరుగుతున్న దౌర్జన్యాలను అరికట్టడానికి, వారిని సకాలంలో రక్షించడానికి కర్ణాటక ప్రభుత్వం పింక్ హోస్సళ పోలీసులను రంగంలోకి దింపింది.
బెంగళూరులో ఆపదలో ఉన్న మహిళలను వెంటనే రక్షించడానికి 51 పింక్ హోస్సళ పోలీసు వాహనాలను సురక్షా అనే యాప్ ను సోమవారం కర్ణాటక ప్రభుత్వం విదాన సౌధ ముందు ప్రారంభించింది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాట్లాడారు.
ఇక బెంగళూరు నగరంలో మహిళలు స్వేచ్చగా సంచరించవచ్చని, ఎలాంటి భయం అవరసం లేదని భరోసా ఇచ్చారు. డయల్ -100, సురక్షా యాప్ కు వచ్చే ఫిర్యాదులకు పింక్ హోస్సళ సిబ్బంది వెంటనే స్పందిస్తారని చెప్పారు. ఫిర్యాదులు అందిన 15 నిమిషాలకు సంఘటనా స్థలానికి హోస్సళ వాహనాలు చేరుకుంటాయని అన్నారు..

ఈ పింక్ హోస్సళ వాహనాల పూర్తి భాద్యతలు మహిళా అధికారులకే అప్పగించారు. ఆపదలో ఉన్న మహిళలు, అమ్మాయిలను రక్షించడానికి ఫిర్యాదు చేసిన వారిని లైవ్ వెహికల్ ట్రాకింగ్ సిస్టం ద్వారా గుర్తించడానికి అన్ని చర్యలు తీసుకున్నామని సిద్దరామయ్య వివరించారు.
ఇటీవల కాలంలో బెంగళూరులో మహిళలు, చిన్నారులపై లైంగిక దౌర్జన్యాలు ఎక్కువ అవుతున్నాయని ఆరోపణలు రావడంతో కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. లండన్ లో ఇప్పటికే అమలు చేస్తున్న ఈ టెక్నాలజీని బెంగళూరులో ప్రవేశపెట్టారు.












Click it and Unblock the Notifications