బెల్జియంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కుమారుడు కన్నుమూత
బెంగుళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పుత్ర వియోగం కలిగింది. బెల్జియంలో చిక్సిత పొందుతున్న సిద్ధరామయ్య పెద్ద కుమారుడు రాకేష్ భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో కన్నుమూశారు. రాకేశ్ శరీరంలో బహుళ అవయవాలు వైఫల్యం అయినట్టు వైద్యలు వెల్లడించారు.
వివరాల్లోకి వెళితే స్నేహితులతో కలిసి యూరప్ టూర్‌కు వెళ్లిన రాకేశ్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. రాకేశ్ ప్యాంక్రియాసిస్‌కు సంబంధించిన వ్యాధితో బాధపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం సిద్ధరామయ్య మంత్రి సుష్మాస్వరాజ్‌తో మాట్లాడి బెల్జియంలో ఉన్న తన కుమారుడికి ఉత్తమ వైద్య సేవలు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.

దీనిపై సుష్మా స్పందించి రాకేష్ కు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని బ్రసెల్స్‌లోని ఇండియన్ ఎంబసీ ఉద్యోగులను ఆదేశించారు. తీవ్ర కడుపునొప్పి రావడంతో అతడిని బ్రస్సెల్స్ యూనివర్సిటీ ఆసుపత్రిలోని ఐసీయూలో చేర్చి చికిత్సను అందిస్తున్నారు.
ఈ వార్త తెలియగానే సిద్ధరామయ్య భార్య, చిన్న కుమారుడు యతీంద్ర, ఫ్యామిలీ డాక్టర్స్ ఇద్దరితో బ్రస్సెల్స్ చేరుకున్నారు. అనంతరం గురువారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెల్జియం బయల్దేరి వెళ్లారు. సీఎం సిద్ధరామయ్య కూడా ప్రస్తుతం బెల్జియంలో ఉన్నారు. రాకేష్‌ను కాపాడేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications