ఆ పార్టీ ప్రభుత్వం అంటేనే బ్రిటీష్ రూల్, మీకు ఏమైనా డౌట్ ?, సీఎం !
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ, ఆ నాయకుల పాలన చూస్తే బ్రిటీష్ పాలన గుర్తుకు వస్తోందని. ఆ పార్టీలోని నాయకులు అందరూ అదే సిద్దాంతాలు పాటిస్తున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల నరనరాల్లో బ్రిటీష్ బిజాలు నాటుకుపోయాయని సీఎం బసవరాజ్ బోమ్మయ్ ఆరోపించారు.
దావణగెరె జిల్లాలోని హరిహరలో సీఎం బసవరాజ్ బోమ్మయ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని సీఎం బసవరాజ్ బోమ్మయ్ ఆరోపించారు. మాజీ సీఎం సిద్దరామయ్య ఒక దిక్కులో ప్రయాణిస్తుంటే కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ మరో దిక్కులో ప్రయాణిస్తున్నారని సీఎం బసవరాజ్ బోమ్మయ్ ఆరోపించారు.

2013 నుంచి 2018 అవధి కాలంలో కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అవినీతి కార్యకలాపాలకు పాల్పడిందని, చివరికి ఎస్టీ, ఎస్టీ బాలికల హాస్టల్స్ లో పరుపులు, దిండ్లు, మంచాలు, దుప్పట్లు సరఫరా చెయ్యడానికి అప్పటి కాంగ్రెస్ నాయకులు లంచాలు తీసుకున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వాన్ని 40 శాతం కమీషన్ ప్రభుత్వం అని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నాయకులు వారు అధికారంలో ఉన్న సమయంలో వందకు 100 శాతం కమీషన్ ప్రభు్వం అని నిరూపించుకుందని, అంతటి అవినీతి ప్రభుత్వాన్ని తాన జీవితంలో చూడలేదని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎస్సీ, ఎస్టీలకు ఎవరు న్యాయం చేశారు ? అనే విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగ చర్చకు వస్తే అన్నింటికి సమాధానం చిక్కుతుందని కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సవాలు విసిరారు. కర్ణాటకలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని, అందులో ఎలాంటి అనుమానంలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications