Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన హీరో సుదీప్, దుమ్ము దులిపేసిన సీఎం ర్యాలీ, జేపీ నడ్డా !

బెంగళూరు/శివమొగ్గ: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ అట్టహాసంగా నామినేషన్ వేశారు. కర్ణాటకలోని శిగ్లావి నియోజక వర్గం నుంచి మరోసారి బసవరాజ్ బోమ్మయ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ, నడ్డా, స్టార్ హీరో కిచ్చా సుదీప్ తో పాటు స్థానిక బీజేపీ నాయకుల సమక్షంలో సీఎం బసవరాజ్ బోమ్మయ్ అట్టహాసంగా నామినేషన్ వేశారు.

నామినేషన్ వేసే ముందు సీఎం బసవరాజ్ బోమ్మయ్ శిగ్లావి పట్టణంలో భారీ రోడ్ షో నిర్వహించారు. ఇదే రోడ్ షోలో కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ తో పాటు కన్నడ స్టార్ హీరో సుదీప్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా పాల్గొన్నారు. బసవరాజ్ బోమ్మయ్ ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో వేలాది మంది బీజేపీ కార్యకర్తలు వెంట ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు.

 elections

అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం బసవరాజ్ బోమ్మయ్ కి తాను మద్దతు ప్రకటిస్తానని ఇప్పటికే కన్నడ స్టార్ హీరో సుదీప్ ప్రకటించిన విషయం తెలిసిందే. బుధవారం సీఎం బసవరాజ్ బోమ్మయ్ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన కన్నడ హీరో కిచ్చా సుదీప్ సీఎం బసవరాజ్ బోమ్మయ్ తరుపున ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టారు.

సీఎం బసవరాజ్ బోమ్మయ్ పేదల కోసం చాలా మంచి పనులు చేశారని, ఇక్కడి ప్రజలు ఆయన్న ఆధరించి ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని స్థానిక ఓటర్లకు హీరో కిచ్చా సుదీప్ మనవి చేశారు. బుధవారం సాయంత్రం వరకు వివిద ప్రాంతాల్లో హీరో సుదీప్ సీఎం బసవరాజ్ బోమ్మయ్ కి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు.

 bommai sudeep

తన కోరిక ప్రకారం తన నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన హీరో సుదీప్ కు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ప్రత్యేక విమానంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ, నడ్డా, హీరో సుదీప్ కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ నామినేషన్ కార్యక్రమానికి శిగ్లావికి హాజరైనారు. హీరో సుదీప్ ను చూడటానికి శిగ్లావిలోని వేలాది మంది ఆయన అభిమానులు పోటీపడ్డారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+