వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొడుకు రాజకీయ భవిష్యత్తు, సీఎంకు తలనొప్పి, ఎన్నికల సర్వే నివేదిక, అధికారులతో సమీక్ష !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మండ్య లోక్ సభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అంటూ కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి తల బద్దలు కొట్టుకుంటున్నారు. మండ్య లోక్ సభ ఎన్నికల్లో తన కుమారుడు నిఖిల్ కుమారస్వామి గెలుస్తారా ? స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బహుబాష నటి సుమలత విజయం సాదిస్తారా ? అంటూ సీఎం కుమారస్వామి ఇంటలిజెన్స్ అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

ఎవరు గెలుస్తారు ?

ఎవరు గెలుస్తారు ?

మండ్య జిల్లాకు చెందిన కొందరు నిఖిల్ కుమారస్వామి విజయం సాదిస్తారు అంటున్నారు. కొందరు మాత్రం సుమలత విజయం సాదిస్తారని అంటున్నారు. ఈ విషయం సీఎం కుమారస్వామికి పెద్ద తలనొప్పిగా తయారైయ్యింది. మండ్య లోక్ సభ ఎన్నికల విషయంలో సీఎం కుమారస్వామి అధికారులతో మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించి సర్వే నివేదిక వివరాలు సేకరించారు.

కులం లెక్కలు ?

కులం లెక్కలు ?

మండ్య జిల్లాలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కులం లెక్కల ప్రకారం ఎవరైనా విజయం సాదిస్తారని వెలుగు చూస్తుంది. లోక్ సభ ఎన్నికలు పూర్తి అయిన వెంటనే సీఎం కుమారస్వామి ఇంటెలిజెన్స్ అధికారులతో సమావేశం నిర్వహించారు. తక్కువ మెజారిటీతో నిఖిల్ కుమారస్వామి విజయం సాదిస్తారని ఇంటలిజెన్స్ అధికారులు సీఎం కుమారస్వామికి నివేదిక సమర్పించారని సమాచారం..

 మహిళా ఓటర్ల దెబ్బ !

మహిళా ఓటర్ల దెబ్బ !

మండ్య లోక్ సభ నియోజక వర్గంలో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. లోక్ సభ ఎన్నికల్లో మహిళలు పెద్డ సంఖ్యలో ఓట్లు వేశారు. మండ్యలో మహిళా ఓటర్ల ఆశీర్వాదంతో విజయం సాదించేది ఎవరు అనే విషయం వేచిచూడాల్సి ఉంది. ఈ నేపధ్యంలో సీఎం కుమారస్వామి మరోసారి ఇంటలిజెన్స్ అధికారులతో మరోసారి సమావేశం నిర్వహించనున్నారు.

సీఎం అసహనం

సీఎం అసహనం

బెంగళూరులోని స్టార్ హోటల్ ఏర్పాటు చేసిన విందుకు మండ్య జిల్లాకు చెందిన రెబల్ ఎమ్మెల్యేలు హాజరైనారు. ఈ రెబల్ ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చూసిచూడనట్లు వ్యవహరించడంతో సీఎం కుమారస్వామి అసహనం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యే మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని సీఎం కుమారస్వామి ఆ పార్టీ నాయకులను నిలదీశారని తెలిసింది.

మూడు నివేదికల సమస్య

మూడు నివేదికల సమస్య

మండ్య లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఇంటలిజెన్స్ అధికారులు మూడు సర్వేల నివేదికలు ఇవ్వడంతో సీఎం కుమారస్వామి తలపట్టుకున్నారని తెలిసింది. ఒక నివేదికలో నిఖిల్ కుమారస్వామి భారీ మెజారిటితో విజయం సాదిస్తారని, మరో నివేదికలో సుమలత విజయం సాదిస్తారని ఉందని సమాచారం. మరోక నివేదికలో నిఖిల్ కుమారస్వామి 50 శాతం విజయం సాదిస్తారని ఉందని, సుమలత గట్టి పోటీ ఇచ్చారని సమాచారం. అమావాస్య సందర్బంగా సీఎం కుమారస్వామి కోప్ప తాలుకా కమ్మరగడిలో శ్రీ ఉమామహేశ్వరి దేవాలయంలో శత్రు సంహారం కోసం ప్రత్యేక పూజలు చెయ్యడానికి వెళ్లారు.

English summary
Karnataka Chief minister HD Kumaraswamy instructed second round of survey of Loksabha election result in Mandya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X