బీజేపీ లీడర్స్ అయోధ్యకు ఎందుకు వెలుతున్నారంటే ?, సీఎం సంచలనం !
దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలని మా ప్రభుత్వాలు సూచించదని, బీజేపీ నాయకులు అయోధ్యకు ఎందుకు వెళ్లి అక్కడే పూజలు చెయ్యాలని చెబుతున్నారని, మనం ఇక్కడ శ్రీరామచంద్రుడిని పూజించలేమా, ఇక్కడ ఉన్న శ్రీరాముడికి విలువ లేదా, ఇక్కడ రాముడికి పూజలు చెయ్యకూడదా అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య బీజేపీ నాయకులను ప్రశ్నించారు.
గురువారం బెంగళూరులోని విధానసౌదలో మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం సీఎం సిద్దరామయ్య మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నాయకుల మీద విరుచుకుపడ్డారు. రాముడికి హిందువులు ఎవరూ వ్యతిరేకం కాదని సిద్దరామయ్య అన్నారు.

బీజేపీ నాయకులు శ్రీరాముడిని రాజకీయంగా ఉపయోగించుకోబోతోందని, శ్రీరామచంద్రుడి అంశాన్ని రాజకీయ అంశంగా మార్చడాన్ని మేం వ్యతిరేకిస్తున్నామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. మనమందరం శ్రీరామచంద్రుని భక్తులం అని బీజేపీ రాజకీయాలు మాట్లాడుతోందని, ఇది మంచి పద్దతి కాదని సిద్దరామయ్య అన్నారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వైఖరిపై స్పందించి పార్టీ హైకమాండ్ నిర్ణయమే మా నిర్ణయమని సిద్దరామయ్య అన్నారు.

రాముడిని పూజించడానికి రామమందిరాన్ని నిర్మించుకున్నాం. దేవుడి పేరుతో రాజకీయాలు చెయ్యడాన్ని మేము వ్యతిరేకం అని సిద్దరామయ్య అన్నారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గురించి మాట్లాడుతూ, రైల్వే విపత్తు సంభవించినప్పుడు, లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేసి ప్రజా జీవితంలో అగ్రస్థానంలో నిలిచారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత ఆయన దేశానికి ప్రధానమంత్రి. జై జవాన్ జై కిసాన్ అని పిలిచాడు. ఆహార స్వయం సమృద్ధి కోసం దేశమంతా ఒక రోజు ఉపవాసం ఉండాలని ఆయన పిలుపునిచ్చారు అని సిద్దరామయ్య గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications