రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు క్షమాపణలు చెప్పిన సీఎం, పొరపాటు జరిగింది సారీ మేడమ్!
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురించి ఏకవచనంతో మాట్లాడిన మాటలకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విచారం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని చిత్రదుర్గలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కర్ణాటక సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి ఏకవచనంతో ప్రసంగించారు. ఈ వీడియో వైరల్ కావడంతో ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
దీనిపై ట్వీట్ చేసిన కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నాయకుడు హెచ్‌డీ కుమారస్వామి మాట్లాడుతూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఏకవచనంతో సంబోధించిన సిద్ధరామయ్యను వెంటనే ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ను డిమాండ్ చేశారు. రాజకీయంగా, ఎస్సీ, ఎస్టీ నాయకుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ట్వీట్ చేసి ఆయన మాట్లాడిన మాటలకు విచారం వ్యక్తం చేశారు.

చిత్రదుర్గలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం సిద్దరామయ్య ఆవేశంగా మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. అణగారిన వారి కోసం ఏర్పాటు చేసిన సదస్సులో సిద్ధరామయ్య మాట్లాడారు. ఈ సమయంలో బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన సిద్ధరామయ్య భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురించి మాట్లాడుతూ ఆమెను ఏకవచనంతో సంభోదించడం కలకలం రేపింది. బీజేపీ నాయకులకు యోగ్యత లేదని సిద్దరామయ్య మండిపడ్డారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కనీస గౌరవం ఇవ్వడం లేదని, అణగారిన సమాజానికి చెందిన ఆమెను కొత్త పార్లమెంటు భవనం ప్రారంభించేందుకు పిలవలేదని, అయోధ్యలో శ్రీరామచంద్రుని ఆలయ ప్రారంభోత్సవానికి పిలవలేదని కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఏకవచనంతో మాట్లాడటంపై మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ಅಂಕೆ ಮೀರಿದ ಭಂಡತನಕ್ಕೆ ಮುಖ್ಯಮಂತ್ರಿ ನೀವೇ ಅತ್ಯುತ್ತಮ ಉದಾಹರಣೆ @siddaramaiah ನವರೇ. ಭಾವುಕನಾಗಿ ಮಾತನಾಡುವ ಭರದಲ್ಲಿ ಗೌರವಾನ್ವಿತ ರಾಷ್ಟ್ರಪತಿಗಳನ್ನು ಏಕವಚನದಲ್ಲಿ ಸಂಬೋಧಿಸಿದೆ ಎಂದು ನೀವು ಕೊಟ್ಟಿರುವ ಸಮಜಾಯಿಷಿ ಮೊಸಳೆಯನ್ನೂ ನಾಚಿಸುವಂತಿದೆ.1/8#ಶಿಷ್ಟಾಚಾರಗೆಟ್ಟ_ಮುಖ್ಯಮಂತ್ರಿ
— ಹೆಚ್.ಡಿ.ಕುಮಾರಸ್ವಾಮಿ | H.D.Kumaraswamy (@hd_kumaraswamy) January 29, 2024
*
"ಗ್ರಾಮೀಣ ಸೊಗಡಿನ ವ್ಯಕ್ತಿತ್ವ ನನ್ನದು. ನಾನು…
సిద్ధరామయ్య ప్రసంగానికి సంబంధించిన వీడియోలను వరుసగా ట్వీట్ చేసిన కుమారస్వామి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఏకవచనంతో సంబోధించిన సిద్ధరామయ్యను వెంటనే ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ని డిమాండ్ చేశారు. దీనిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ట్వీట్ చేస్తూ రాష్ట్రపతిని ఏకవచనంతో మాట్లాడిన మాటలకు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దళిత వర్గానికి (ఎస్టీ) చెందినందున ఆమెను పార్లమెంటు ప్రారంభోత్సవానికి, అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి పిలవకుండా బీజేపీ నేతలు ఆమెను అవమానించడం నాకు చాలా బాధ కలిగించడమే కాకుండా నాకు కోపం తెప్పించిందని సీఎం సిద్దరామయ్య వివరించారు. అణగారిన వర్గాల అవగాహన సదస్సులో తాను కాస్త ఉద్వేగానికి లోనయ్యానని, ఈ ఆగ్రహాన్ని వెళ్లగక్కేందుకు తాను రాష్ట్రపతిని ఏకవచనంతో సంబోధించానని సీఎం సిద్దరామయ్య విచారం వ్యక్తం చేశారు.
గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నాలాంటి వారు తల్లిదండ్రులను, పెద్దలను ఏకవచనంతో సంబోధించడం ఆనవాయితీగా, అలవాటుగా వస్తోందని, అదే ఫ్లోలో తాను గౌరవనీయులైన రాష్ట్రపతిని ఏకవచనంతో మాట్లాడేశానని, తాను రాష్ట్రపతిని ఏకవచనంతో సంబోధించకండా ఉండాల్సిందని, అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు తాను చింతిస్తున్నట్లు సీఎం సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. అయితే రెండు సార్లు ఉన్నతమైన సీఎం పదవి చేపట్టిన సిద్దరామయ్యకు, న్యాయవాది అయిన ఆయనకు ఎవరిని ఎలా సంబోధించాలో తెలీదా ? అంటూ జేడీఎస్, బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.
-
ఇరాన్ వార్ పై ప్రధాని సమీక్ష-చమురు, గ్యాస్, ఎరువులపై కీలక నిర్ణయాలు ? -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
మంగళూరు చేరిన భారీ ఎల్పీజీ షిప్- గ్యాస్ కష్టాలకు చెక్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications