సిద్ధరామయ్యకు వాస్తు దెబ్బ: తెరచుకున్న దక్షిణ ద్వారం- అయిదేళ్ల తరువాత

బెంగళూరు: కిందటి నెలలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంది కర్ణాటక. 224 అసెంబ్లీ స్థానాలకు మే 10వ తేదీన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయాన్ని సాధించింది. 135 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటివరకు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 66 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. కుమారస్వామి సారథ్యంలోని జనతాదళ్ (సెక్యులర్)- 19, ఇతరులు నాలుగు చోట్ల విజయం సాధించారు.

సరిగ్గా నెలన్నర రోజుల వ్యవధిలో కర్ణాటకలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. శాసన మండలిలో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఇదివరకే కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ముగ్గురు శాసన మండలి సభ్యులు తమ సభ్యత్వానికి రాజీనామా చేయడం వల్ల ఈ ఎన్నికలు అవసరం అయ్యాయి. ఈ మూడు చోట్లా అభ్యర్థులను కూడా ప్రకటించింది కాంగ్రెస్.

CM Siddaramaiah

మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టార్‌, కలబురగి జిల్లాకు చెందిన తిప్పన్నప్ప కమక్నూర్, రాయచూర్ జిల్లాకు చెందిన మంత్రి ఎన్ఎస్ బోస్‌రాజు పేర్లను ప్రకటించింది. ఈ ఎన్నికలను సవాల్‌గా తీసుకుంది కాంగ్రెస్. మూడింటినీ గెలిచేలా వ్యూహాలను రూపొందించుకుంటోంది. ఎమ్మెల్యేల కోటాలో జరగాల్సిన ఎన్నికలు ఇవి. ఈ నెల 30వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది.

అటు పరిపాలన పరంగా సవాళ్లను ఎదుర్కొంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. వేల కోట్ల రూపాయలు వ్యయం అయ్యే అయిదు ఉచిత పథకాలను ప్రకటించడం, అధికారంలోకి వచ్చిన వెంటనే రెండింటిని అమలు చేయడం వల్ల ఆర్థిక భారం రోజురోజుకూ పెరుగుతోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే శక్తి పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. జులై 1వ తేదీన గృహ జ్యోతికి అమలు కానుంది. దీని కింద గృహావసర వినియోగదారులకు ప్రతినెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందుతుంది.

ఇన్ని సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉన్న నేపథ్యంలో- సిద్ధరామయ్య కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. వాస్తు నిపుణులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు విధానసౌధలోని తన ఛాంబర్‌లో మార్పులు చేర్పులు చేయించారు. ఛాంబర్‌లోకి అడుగుపెట్టడానికి ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ద్వారాన్ని మూసివేశారు. దానికి బదులుగా దక్షిణ ద్వారాన్ని వినియోగంలోకి తీసుకొచ్చారు.

అయిదు సంవత్సరాలుగా మూసి ఉన్న ద్వారం ఇది. ఇవ్వాళ వాస్తు పూజలను నిర్వహించిన అనంతరం దీన్ని తెరిచారు. సిద్ధరామయ్య ఈ ద్వారం గుండా తన ఛాంబర్‌లోకి అడుగుపెట్టారు. ప్రజల సంక్షేమం పట్ల శ్రద్ధ, పరిపాలనలో నిజాయితీ, కర్తవ్యం పట్ల విధేయత మనలో ఉంటే వాస్తు కూడా చిన్నబోతుందంటూ వ్యాఖ్యానించారు సిద్ధరామయ్య. వాస్తుదోషాల కారణంగా అయిదేళ్లుగా మూతపడిన విధానసౌధలోని ముఖ్యమంత్రి కార్యాలయం దక్షిణ ద్వారాన్ని ఇవ్వాళ తెరిచామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+