సీఎంకు రూ 10 వేలు ఫైన్ వేసిన కోర్టు, సీఎంతో సహా నాయకులకు సమన్లు, విచారణకు రండి !
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఊహించని ఎదురుదెబ్బ పడింది. 2022 ఏప్రిల్ నెలలో సివిల్ కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య కేసుకు సంబంధించి అప్పటి రాష్ట్ర మంత్రి కేఎస్ ఈశ్వరప్పను (బీజేపీ)ని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపిన ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులపై కర్ణాటక హైకోర్టు మంగళవారం తీవ్రంగా మండిపడింది.
సీఎం సిద్ధరామయ్య, ఆయన కేబినెట్ సహచరులైన భారీ, మధ్యతరహా పరిశ్రమల శాఖా మంత్రి ఎంబీ పాటిల్, రవాణా శాఖా మంత్రి రామలింగా రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలా వంటి వారిపై మండిపడిన న్యాయస్థానం రూ 10,000 రూపాయల జరిమానా విధించింది. మార్చి 6వ తేదీన సీఎం సిద్ధరామయ్య విచారణకు హాజరు కావాలని, మార్చి 7వ తేదీన కర్ణాటక రవాణా శాఖా మంత్రి రామలింగా రెడ్డి, మార్చి 11వ తేదీన కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఇంచార్జి రణదీప్ సింగ్ సూర్జేవాలా, మార్చి 15వ తేదీన కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్ కోర్టులో విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసిన కోర్టు వారికి సమన్లు జారీ చేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

కర్ణాటకకు చెందిన కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ మృతిలో మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప ప్రమేయం ఉందని ఆరోపిస్తూ ఈశ్వరప్పను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బెంగళూరులోని విధానసౌదలో అప్పటి ప్రతిపక్ష నేతలు నిరసనకు దిగారు. అంతే కాకుండా అప్పటి సీఎం బసవరాజ్ బోమ్మయ్ తన పదవికి రాజీనామా చేయాలని అప్పట్లో డిమాండ్ చేస్తూ ఆయన అధికారిక నివాసానికి నియమాలు ఉల్లంఘించి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదయాత్ర చేశారనే ఆరోపణలున్నాయి. ఆ సందర్బంలో వీరి మీద కేసులు నమోదు అయ్యాయి.

ఈ నేపథ్యంలో తమపై నమోదైన క్రిమినల్ కేసును రద్దు చేయాలని కోరుతూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఇతర కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ దీక్షిత్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ కొట్టివేసింది. అంతేకాకుండా విచారణకు హాజరుకావాలని సీఎం సిద్దరామయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులకు సమన్లు జారీ చేశారు. 2022 ఏప్రిల్ 2022లో సివిల్ కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఉడిపిలోని ఓ లాడ్జిలో శవమై కనిపించాడు.
ప్రతి కాంట్రాక్ట్ నుంచి 40 శాతం కమీషన్ అడుగుతున్నారని, అప్పటి మంత్రి కేఎస్ ఈశ్వరప్ప అవినీతికి పాల్పడ్డారని సిద్దరామయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ సమయంలో అప్పటి గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖా మంత్రి పదవికి కేఎస్ ఈశ్వరప్ప రాజీనామా చేశారు. సివిల్ కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు రావడంతో కేఎస్ ఈశ్వరప్ప అప్పట్లో ఆయన మంత్రి పదవికి రాజీనామా చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చెయ్యడనికి కేఎస్ ఈశ్వరప్పకు బీజేపీ హైకమాండ్ అవకాశం ఇవ్వలేదు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications