మీరు సహాయం చెయ్యండి, షాతో సీఎం భేటీ, డబ్బులు మొత్తం వెంటనే ఇవ్వండి !
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీలో కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్‌షాతో సమావేశమై ప్రకృతి వైపరీత్యాలపై తక్షణమే ఉన్నతస్థాయి కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి కర్ణాటక రాష్ట్రానికి కరువు సాయం అందేలా చర్యలు తీసుకోవాలని మనవి చేశారు. కర్ణాటక రాష్ట్రంలో తీవ్రమైన కరువు పరిస్థితి నెలకొని ఉందని, 236 తాలూకాల్లో కరువు ప్రభావితం అయ్యాయని సీఎం సిద్దరామయ్య కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు వివరించారు.
దాదాపు 48.19 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, దీని వల్ల రైతులు. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో చిన్న, అతి చిన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిద్దరామయ్య కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షాకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఎన్ డీఆర్ఎఫ్ మార్గదర్శకాల ప్రకారం కరువు సహాయం విడుదలకు మొదటి ప్రతిపాదన సమర్పించి మూడు నెలలు గడిచిందని, వెంటనే ఉన్నతస్థాయి కమిటీ సమావేశం నిర్వహించి రూ. 18,177. 44 కోట్లు కేటాయించాలని సిద్దరామయ్య మనవి చేశారు.

రాష్ట్రంలోని రైతుల సమాచార సేకరణ సాఫ్ట్‌వేర్ అయిన ఫ్రూట్స్‌లో నమోదు చేయబడిన సమాచారం పీఎం కిసాన్ పథకం కోసం పరిగణించబడుతోంది. అదేవిధంగా పంట నష్టపరిహారం పంపిణీకి ఈ డేటాను పరిగణనలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షాను కోరారు. కరువు సహాయం కోసం రాష్ట్రం యొక్క మొదటి ప్రతిపాదనను 22-09-2023న కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకు సమర్పించారు.
భారత ప్రభుత్వ కరువు అధ్యయన బృందం అక్టోబర్ 4వ తేదీ నుండి 9వ తేదీ మధ్య కర్ణాటకలో పర్యటించి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే నివేదికను సమర్పించింది. ఆ తర్వాత మరో 21 తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించారు. అందుకే అక్టోబర్ 20వ తేదీన కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకు ఎన్‌డిఆర్‌ఎఫ్ పంపింది. రూ.17,901.73 కోట్లు సహాయనిధఇ అందించాలని కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదన సమర్పించారు. ఇందులో రూ. 12, 577. 86 కోట్ల తక్షణ సాయం. మొత్తం అందింయాలని మనవి చేసింది.












Click it and Unblock the Notifications