నటి రమ్య మేడమ్‌కు మంత్రి పదవి మిస్
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన మంత్రి వర్గంలో నలుగురికి అవకాశం కల్పించారు. గురువారం సాయంత్రం నలుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాల రాజ్ భవన్ లో నలుగురు కొత్త మంత్రుల దగ్గర ప్రమాణ స్వీకారం చేయించారు.
కేపీసీసీ అధ్యక్షుడు, ఎంఎల్ సీ డాక్టర్ జీ. పరమేశ్వర్, హాసన్ జిల్లా అరకలగూడు శాసన సభ్యుడు మంజు, ధారవాడ శాసన సభ్యుడు వినయ్ కులకర్ణి, హావేరి జిల్లా హానగల్ శాసన సభ్యుడు మనోహర్ తహసిల్దార్ సిద్దరామయ్య మంత్రి వర్గంలో చోటు సంపాధించుకున్నారు.

రమ్య మేడమ్ కు షాక్!
మండ్య మాజీ ఎంపీ, బహుబాష నటి రమ్యకు సిద్దరామయ్య క్యాబినెట్ లో చోటు చిక్కిందని జోరుగా ప్రచారం జరిగింది. ఇదే సందర్బంలో రమ్య మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎమ్. కృష్ణ నివాసం చేరుకుని సుధీర్ఘంగా చర్చించారు.
ఈ నేపధ్యంలో రమ్యకు మంత్రి పదవి గ్యారెంటి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. అయితే మండ్య జిల్లా కాంగ్రెస్ నాయకులు, పలువురు శాసన సభ్యులు రమ్యకు మంత్రి పదవి వద్దని, ఆమెను ఎంఎల్ సీ చెయ్యరాదని అధిష్టానానికి లేఖలు వ్రాశారు.
అయితే కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దగ్గర మంచి గుర్తింపు ఉన్న రమ్య గ్యారెంటిగా మంత్రి పదవి చేజిక్కించుకుంటుందని పలువురు నాయకులు అనుకున్నారు. కన్నడ రెబల్ స్టార్, మంత్రి అంబరీష్ తో రమ్య అనవసరంగా పెట్టుకోవడం వలనే ఆమెకు మంత్రి పదవి మిస్ అయ్యిందని పలువురు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications