మోదీ ప్రేమతో డబ్బులు ఇవ్వలేదు, సుప్రీం కోర్టు చెబితే ఇచ్చారు, సీఎం సంచలనం !

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించిన సుప్రీం కోర్టు కర్ణాటకకు కొంత కరువు సాయం అందించాలని ఆదేశాలు ఇచ్చినందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు అని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. ఎన్డీఆర్ఎఫ్ నిబంధనల ప్రకారం కర్ణాటక రాష్ట్రానికి రూ.18,171 కోట్లు చెల్లించాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం కేవలం రూ. 3,498. 98 కోట్లు మాత్రమే ఇచ్చిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు.

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తెలియజేస్తూ ఈ డబ్బు కరువు సహాయం చాలదని, మాకు రావలసిన బకాయిల కోసం కేంద్ర ప్రభుత్వం మీద మేము పోరాటం కొనసాగిస్తామని సిద్దరామయ్య అన్నారు. కర్ణాటకపై ప్రేమతో కేంద్ర ప్రభుత్వం ఈ కరువు సాయం ఇవ్వలేదని, మేము సుప్రీంకోర్టు మెట్లు ఎక్కి మా కష్టాలను మనవి చేసి న్యాయస్థానాన్ని ఒప్పించుకున్నామని, ఈ పిటిషన్‌ విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాజకీయ దురుద్దేశంతోనే కర్ణాటకకు కేంద్రం అన్యాయం చేస్తోందని అభిప్రాయపడిందని సిద్దరామయ్య అన్నారు.

Karnataka CM Siddaramaiah made serious allegations against the central government

కోర్టు విచారణ సందర్భంగా వారం రోజుల్లోగా కరువు సాయం అందజేస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పిందని సిద్దరామయ్య అంటున్నారు. కర్ణాటకకు కరువు సాయం అందడంలో కేంద్ర ప్రభుత్వం పాత్రకాని, కర్ణాటకలోని బీజేపీ నాయకులు పాత్ర ఏమాత్రం లేదని సీఎం సిద్దరామయ్య అన్నారు. కర్ణాటకలోని రాష్ట్ర వ్యవసాయ రంగంపైనా, రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆందోళన లేదని, సుప్రీం కోర్టు కారణంగా కేంద్ర ప్రభుత్వం కర్ణాటకకు నిధులు ఇచ్చిందని సిద్ధరామయ్య అన్నారు.

కొంత ఉపశమనం కలిగించకపోతే కర్ణాటక ప్రజలు తమను ఎన్నికల ప్రచారానికి మన రాష్ట్రంలోకి రానివ్వరన్న కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలకు భయం పట్టుకోవడమే ఈ పరిహారాన్ని ప్రకటించడానికి కారణం అని సిద్దరామయ్య అంటున్నారు. కర్ణాటక బీజేపీ నాయకులు ఈ చిన్న ఉపశమనాన్ని తమ ఘనతగా చిత్రీకరిస్తుంటే వారికి తగిన సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రజలకు సీఎం సిద్దరామయ్య మనవి చేశారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య కేంద్ర ప్రభుత్వంపై ఇలాంటి ఆరోపణలు చెయ్యడంతో ఆ రాష్ట్రంలోని బీజేపీ నాయకులు ఆయన మీద మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+