Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జరిగింది ఏదో జరిగిపోయింది. మీరే ఆదుకోండి. జగన్, కేసీఆర్ నో చెప్పడంతో ఢిల్లీలో !

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని బీపీఎల్ రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి 10 కేజీల ఉచిత బియ్యం ఇవ్వడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నది. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భేటీ అయ్యారు. కేంద్ర విధానం వల్ల పేదలకు అన్నం పెట్టే సమస్యపై కేంద్ర మంత్రి అమిత్ షాతో కర్ణాటక సీఎం సిద్దరామయ్య చర్చించారు.

స్నేహపూర్వక పర్యటన సందర్భంగా అమిత్ షాతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వ విధానం ఆహారభద్రత చట్టానికి వ్యతిరేకంగా ఉందని, పేదలు రెండు పూటల భోజనానికి కూడా ఇబ్బందిగా మారిందని, కేంద్ర ప్రభుత్వ పాలసీ అమలు అయితే బాగుంటుందని, కర్ణాటకకు ఆహార ధాన్యాలు ఇవ్వాలని సీఎం సిద్దరామయ్య కేంద్ర మంత్రి అమిత్ షాకు మనవి చేశారు.

Karnataka CM Siddaramaiah requested Union Home Minister Amit Shah to supply rice

సీఎం సిద్ధరామయ్యతో మాట్లాడిన తరువాత కేంద్ర మంత్రి అమిత్ ఈ విషయంపై గురువారం కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖా మంత్రి పీయూష్ గోయల్‌తో చర్చిస్తానని సిద్దరామయ్యకు హామీ ఇచ్చారని తెలిసింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సిద్ధరామయ్య కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కావడం ఇదే తొలిసారి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీపీఎల్, అంత్యోదయ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 10 కేజీల బియ్యం ఉచితంగగా అందించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.

కానీ దీనికి అవసరమైన అదనపు బియ్యాన్ని సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఇతర రాష్ట్రాల నుంచి బియ్యాన్ని కొనుగోలు చేసి పంపిణీ చేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆలోచిస్తున్నప్పటికీ రవాణా ఖర్చు మాత్రం ఎక్కువ అయ్యే అవకాశం ఉందని వెలుగు చూసింది.

Karnataka CM Siddaramaiah requested Union Home Minister Amit Shah to supply rice

ఫుడ్ కార్పొరేషన్ నుంచి కర్ణాటక రాష్ట్రానికి కావాల్సిన బియ్యాన్ని అందించకుండా, కాంగ్రెస్ పరిపాలన ఎన్నికల హామీని తుంగలో తొక్కేందుకు కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కుట్ర చేస్తోందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటకలోని కాంగ్రెస్ మంత్రులు, డిల్లీలోని కాంగ్రెస్ పార్టీ నేతలు గత కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.

తెలంగాణ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ వంటి వివిధ రాష్ట్రాల నుంచి బియ్యం కొనుగోలు చెయ్యడానికి కర్ణాటక ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. అయితే కర్ణాటక రాష్ట్రానికి కావాల్సిన 2, 28, 000 మెట్రిక్ టన్నులు సరిపోవడం లేదన్నారు. ఈ రాష్ట్రాల నుంచి బియ్యం కొనుగోలు చేసినా రవాణా ఖర్చు పెరిగే అవకాశం ఉందిని అధికారులు అంచనా వేశారు.

Karnataka CM Siddaramaiah requested Union Home Minister Amit Shah to supply rice

ఎన్‌సీసీఎఫ్, నాఫెడ్, సెంట్రల్ భండార్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల నుండి కొటేషన్‌లను పిలిచాము. వారి నుండి సమాచారం వచ్చిన తర్వాత మేము తదుపరి ప్రాజెక్ట్‌పై నిర్ణయం తీసుకుంటాము. ప్రాజెక్ట్ అమలులో కొంత జాప్యం జరగవచ్చు. కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. మొత్తం మీద కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షాతో భేటీ అయిన సీఎం సిద్దరామయ్యకు కేంద్ర ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ వస్తుందా ? లేదా నో అనే సమాధానం వస్తుందా అని వేచిచూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+