ఆ పని జరగకపోతే సీఎం పదవికి రాజీనామా చెయ్యాల్సిందే, బాంబు పేల్చిన సొంత పార్టీ ఎమ్మెల్యే!
కర్ణాటక రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలవకుంటే నైతిక బాధ్యత వహిస్తూ సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయాల్సి ఉంటుందని తుమకూరు జిల్లాలోని గుబ్బి నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎస్.ఆర్. శ్రీనివాస్ బాంబు పేల్చారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ ప్రకటనతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ సీనియర్ నాయకులు హడలిపోయారు. సొంతపార్టీ ఎమ్మెల్యే శ్రీనివాస్ స్టేట్ మెంట్ తో సీఎం సిద్దరామయ్య షాక్ అయ్యారని తెలిసింది.
లోక్‌సభ ఎన్నికల పోరు చాలా జోరుగా సాగుతోంది. వరుసగా మూడోసారి కేంద్రంలో అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ వ్యూహం రచించించింది. అయితే కాంగ్రెస్ కూడా ఇండియా కూటమితో కలిసి అధికారం చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎక్కువ ఎంపీ సీట్లు కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. కర్ణాటక రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలకు పార్టీ ముఖ్యులకే లోక్ సభ ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించారు.

అందుకు తగ్గట్టుగానే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులంతా రంగంలోకి దిగారు. గుబ్బి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎస్. ఆర్. శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలవకుంటే నైతిక బాధ్యత వహిస్తూ సిద్ధరామయ్య ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చెయ్యడం కలకలం రేపింది.
ఇదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట మార్చారు. పేదలు, అణగారిన వర్గాల కోసం ఎంతో నిజాయితీగా పనిచేస్తున్న సిద్ధరామయ్యను కాపాడేందుకు మనమందరం కలిసికట్టుగా కృషి చేయాలని, ఆ దిశగా కృషి చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. తుమకూరు లోక్‌సభ నియోజక వర్గంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య ప్రత్యక్ష పోరు నెలకొంది. బీజేపీ నుంచి వి. సోమన్న అభ్యర్థి అయితే కాంగ్రెస్ నుంచి ఎస్పీ. ముద్దహనుమే గౌడ రంగంలోకి దిగారు.

తుమకూరు లోక్ సభ నియోజక వర్గంలో కాంగ్రెస్ అధిష్టానం ఆధిక్యత కనబరుస్తున్నప్పటికీ, బీజేపీకి గట్టి పోటీ ఎదురుకానుంది. జేడీఎస్‌తో పొత్తు పెట్టుకోవడంతో లింగాయత్‌లు, ఒక్కలిగల ఓట్లను తమవైపు తిప్పుకోగలమన్న విశ్వాసంతో బీజేపీ ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి ముద్దహనుమేగౌడ 2014 నుంచి 2019 వరకు ఎంపీగా ఉండి అభివృద్ధి పనులతో నియోజకవర్గంలో మంచి ఎంపీగా గుర్తింపు తెచ్చుకున్నారు.
గత లోక్ సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో బీజేపీలో చేరిన ముద్దహనుమే గౌడ ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌లో చేరి మళ్లీ లోక్‌సభలో అడుగుపెట్టడం ఖాయం కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications