congress mla anand singh karnataka statement police CM govt resort incident bengaluru hospital కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ కర్ణాటక సమాచారం పోలీసు సీఎం ప్రభుత్వం రిసార్టు సంఘటన బెంగళూరు ఆసుపత్రి
రిసార్టులో కాంగ్రెస్ ఎమ్మెల్యేల ముష్టి యుధ్దం: అసలు ఏం జరిగిందంటే, చంపేస్తారు: ఆనంద్ సింగ్ !
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల రిసార్టు ముష్టియుధ్దం ఆ పార్టీ నాయకులకు తల నొప్పిగా తయారైయ్యింది. దాడిలో తీవ్రగాయాలై బెంగళూరులోని శేషాధ్రిపురం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ సాటి కంప్లీ శాసన సభ్యుడు గణేష్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను చంపడానికి ప్రయత్నించారని, తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని ఆనంద్ సింగ్ పోలీసులకు మనవి చేశారు.

రిసార్టులో రాత్రి డిన్నర్
కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సూచన మేరకు బెంగళూరు శివార్లలోని బిడిది సమీపంలో ఉన్న ఈగల్ రిసార్టుకు తాను చేరుకున్నానని ఆనంద్ సింగ్ పోలీసులకు చెప్పారు. శనివారం రాత్రి డిన్నర్ అయిన తరువాత మంత్రులు తుకారాం, తన్వీర్ సేఠ్, ఎమ్మెల్యే రఘమూర్తితో కలిసి తాను రూమ్ ( రూం నెంబర్ 207)కు వెలుతుంటే ఎమ్మెల్యే గణేష్ పురుషపదజాలంతో తనను దూషించాడని ఆనంద్ సింగ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై హత్యాయత్నం కేసు.. పార్టీ నుంచి సస్పెండ్

తుపాకి ఇవ్వండి !
నా మీద పార్టీ నాయకులకు తప్పుడు సమాచారం ఇస్తావా ? అంటూ ఒక్కసారిగా తన మీద ఎమ్మెల్యే గణేష్ దాడి చేశాడని ఆనంద్ సింగ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన తలను గొడవకు వేసి భలంగా దాడి చేశాడని, నా తుపాకి ఇవ్వండి, వీడిని ఇక్కడే చంపేస్తానని ఎమ్మెల్యే గణేష్ గట్టిగా కేకలు వేశాడని ఆనంద్ సింగ్ ఆరోపించాడు.

నచ్చచెప్పప్పినా వినలేదు !
ఇంత జరిగినా తాను సాటి ఎమ్మెల్యే గణేష్ కు నచ్చ చెప్పడానికి ప్రయత్నించానని, నీవు తనకు సోదరుడులాంటివాడు అని చెబుతున్నా మళ్లీ దాడి చేశాడని ఆనంద్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తన రాజకీయ జీవితానికి నీవు అడ్డువుస్తున్నావని, నిన్ను ఇక్కడే అంతం చేస్తానని గణేష్ మళ్లి దాడి చేశాడని ఆనంద్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దాడితో నామతి పోయింది
ఎంత నచ్చ చెప్పినా వినకుండా గణేష్ తన మీద దాడి చేశాడని, రిసార్టులో ఉన్న పూల కుండీ తన తల మీద వెయ్యడంతో తీవ్రగాయాలైనాయని, కడుపు మీద భలంగా దాడి చెయ్యడంతో మతిస్థమితం కోల్పోయానని, సృహలోకి వచ్చి చూసిన తరువాత తాను శేషాధ్రిపురం అపోలో ఆసుపత్రిలో ఉన్నానని ఆనంద్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చంపేస్తారని భయంగా ఉంది ?
తనును చంపేస్తారని భయంగా ఉందని, చంపుతామని బెదిరించారని, తన మీద దాడి చేసిన ఎమ్మెల్యే గణేష్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆనంద్ సింగ్ పోలీసులకు మనవి చేశారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని ఆనంద్ సింగ్ పోలీసులకు మనవి చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎమ్మెల్యే గణేష్ కోసం గాలిస్తున్నారు.