ప్రభుత్వాన్ని కూల్చేసి..కాలినడకన తిరుమలకు కర్ణాటక తిరుగుబాటు ఎమ్మెల్యే!
తిరుపతి: కర్ణాటకలో 14 నెలల పాటు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని కుప్ప కూల్చడంలో 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రధాన పాత్ర పోషించారు. ఈ 16 మందిలో ఒకరైన కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ శుక్రవారం ఏడుకొండలవాడిని దర్శించుకోవడానికి తిరుమలకు చేరుకున్నారు.
అలిపిరి మెట్ల మార్గం గుండా ఆయన కాలి నడకన కొండపైకి చేరుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మొట్టమొదటగా నాయకుడు ఆనంద్ సింగ్.ఈ నెల 1వ తేదీ నాడే ఆయన తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ రమేష్‌కుమార్‌కు అందజేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత కాంగ్రెస్‌కు చెందిన 12 మంది, జనతాదళ్ (ఎస్) నుంచి ముగ్గురు తమ శాసన సభ సభ్యత్వాలకు రాజీనామాలను అందజేశారు.

ఫలితంగా- ముఖ్యమంత్రి కుమారస్వామి తమ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. భారతీయ జనతాపార్టీ కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మార్గం సులువైంది. ఆయనను గుర్తించిన కొందరు విలేకరులు మాట్లాడటానికి ప్రయత్నించారు. వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన ఈ పరిస్థితుల్లో రాజకీయాల గురించి తాను మాట్లాడబోనని అన్నారు.












Click it and Unblock the Notifications