డీకే మార్క్ తో ఎంపీ సీట్లు, మాట నిలబెట్టుకున్న హైకమాండ్, స్టార్ హీరో ఫ్యామిలీకి మరో చాన్స్!

లోక్‌సభ ఎన్నికలకు ముందుగానే కర్ణాటకలో కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రకటించింది. శివరాత్రి పండుగ రోజు కొంత మందికి గుడ్ న్యూస్ చెప్పిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కొందరు నాయకులకు ఝలక్ ఇచ్చింది. తొలి జాబితాలో కర్ణాటకలోని 7 లోక్ సభ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. డీకే శివకుమార్ రాజకీయ మార్క్ తో కొందరు ఎంపీ సీట్లు దక్కించుకున్నారు.

కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ-జేడీఎస్ అభ్యర్థుల పేర్లను ప్రకటించకముందే కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లను ప్రకటించి లోక్ సభ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాష్ట్రంలో కేవలం ఒక్క నియోజకవర్గంలో మాత్రమే విజయం సాధించింది. గత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బెంగళూరు గ్రామీణ లోక్ సభ నియోజక వర్గం నుంచి విజయం సాధించింది.

Karnataka DCM DK Savakumar gave MP tickets to his followers in the Lok Sabha elections

బెంగళూరు గ్రామీణ లోక్ సభ నియోజక వర్గం నుంచి డీకే సురేష్ ఎంపీగా విజయం సాధించారు. అయితే డీకే శివకుమార్, డీకే సురేష్ సోదరులు వారి సొంత ఇమేజ్ తో బెంగళూరు లోక్ సభ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారని ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు చాలాసార్లు బహిరంగంగానే చెప్పారు. ఈసారి 20 నుండి 25 లోక్ సభ నియోజకవర్గాల్లో గెలవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆ పార్టీ ఎంపీ అభ్యర్థులను బేరీజు వేసుకుని ఎంపిక చేసింది

2019 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో మొత్తం 28 నియోజకవర్గాల్లో 25 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. నరేంద్ర మోదీ వేవ్‌కి కర్ణాటకలో కాంగ్రెస్‌ కొట్టుకుపోయింది. జేడీఎస్ 1 స్థానంలో, కాంగ్రెస్ 1 స్థానంలో, స్వతంత్ర పార్టీ అభ్యర్థి సుమలత అంబరీష్ మండ్యలో గెలుపొందారు. బెంగళూరు రూరల్ నియోజకవర్గంలో డి. కే సురేష్ ఓక్కడే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంపీ గా ఉన్నారు.

Karnataka DCM DK Savakumar gave MP tickets to his followers in the Lok Sabha elections

ఈసారి బీజేపీ ఇంకా ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయలేదు. కాంగ్రెస్ ఇప్పటికే ఎన్నికలకు సిద్ధమైంది. తుమకూరు నియోజకవర్గంలో గతసారి ఎస్పీ ముద్దనుమేగౌడను విస్మరించి జేడీఎస్ తో పొత్తు పెట్టుకుని హెచ్‌డీ దేవెగౌడకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. ఎస్పీ ముద్దహనుమేగౌడ బీజేపీలో చేరడంతో అక్కడ సీన్ రివర్స్ అయ్యింది. అయితే ఇప్పుడు ముద్దహనుమేగౌడ మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు.

శ్యాండిల్ వుడ్ ప్రముఖ హీరో డాక్టర్ శివరాజ్‌కుమార్‌ భార్య గీతా శివరాజ్‌కుమార్‌ శివమొగ్గ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం వచ్చింది. శివమొగ్గలో సిట్టింగ్ ఎంపీ బీవై రాఘవేంద్ర మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుమారుడు మరోసారి ఎంపీగా పోటీ చెయ్యడానికి సిద్దం అవుతున్నారు. బీఎస్ యడియూరప్ప కుమారుడు, సిట్టింగ్ ఎంపీ రాఘవేంద్ర మీద గీతా శివరాజ్ కుమార్ పోటీ చేయనున్నారు, కర్ణాటకలోని హై ఓల్టేజ్ లోక్ సభ నియోజక వర్గాల్లో శివమొగ్గ చేరిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+