కర్ణాటక బార్డర్ లో హై అలర్ట్, ఆ రాష్ట్రాల నుంచి వస్తే కోవిడ్ పరీక్షలు చెయ్యండి, రూల్స్ పాటించాలి!
కేరళలో కరోనా వైరస్ (Covid 19) దెబ్బకు పక్క రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. కరోనా వైరస్ మరోసారి పంజా విసరడంతో ప్రజలు హడలిపోతున్నారు. కరోనా వైరస్ కారణంగా ఇతరుల ప్రాణాలకు హాని జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటి నుంచి అలర్ట్ అయ్యారు. కరోనా వైరస్ మరోసారి తెర మీదకు రావడంతో అందరూ షాక్ అయ్యారు.
కేరళలో ఇటీవల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువ అయ్యాయి. కరోనా వైరస్ దెబ్బతో కేరళ ప్రజలు హడలిపోతున్నారు. ఇదే సమయంలో కేరళ ప్రభుత్వం అనేక నియమనిబంధనలు విదించింది. కేరళలో కరోనా వైరస్ ను అరికట్టడానికి అక్కడి ప్రభుత్వం సిద్దం అయ్యింది. కేరళలోని శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయానికి వెలుతున్న భక్తులకు కేరళ ప్రభుత్వం కొన్ని నియమాలు పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.

కేరళలో కోవిడ్ కేసులు ఎక్కువ కావడంతో కర్ణాటక ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కేరళలోని అయ్యప్పస్వామి ఆలయానికి వెళ్లి వస్తున్న అయ్యప్ప భక్తుల మీద నిఘా వెయ్యాలని కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి దినేష్ గుండూరావ్ ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటకలో 60 ఏళ్ల వయసు కంటేఎక్కువ ఉన్న సీనియర్ సిటిజన్లు తప్పకుండా మాస్క్ లు వేసుకోవాలని కర్ణాటక ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.
కేరళ, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల నుంచి కర్ణాటకలోకి వస్తున్న వారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని అధికారులు సూచించారు. దగ్గు, జలుబు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వారు తప్పకుండా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు. ముందు జాగ్రత్త చర్యగా కర్ణాటకలో ఇప్పటి నుంచి కరోనా వైరస్ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కర్ణాటకలోని బెంగళూరు శివార్లలోని రామనగరలో ఓ విద్యార్థికి, మండ్య జిల్లాలోని మద్దూరులో మరో వ్యక్తికి కోవిడ్ 19 పాజిటివ్ రావడంతో కర్ణాటక ప్రభుత్వం, బెంగళూరులోని ఆరోగ్య శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. కర్ణాటకలో ఇప్పటి వరకు 81 మందికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలిందని అధికారులు అంటున్నారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి కేరళలో అడుగుపెట్టే వ్యక్తులు అందరికి వైద్యపరీక్షలు నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.












Click it and Unblock the Notifications