ఐటీ హబ్ ను టార్గెట్ చేసిన డీసీఎం, లిస్ట్ లో మాస్ లీడర్స్, మాజీ ఎమ్మెల్యే నందీష్ రెడ్డి !

బెంగళూరు: 2019లో కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి బీజేపీలోకి ఫిరాయించిన బెంగళూరు ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి మళ్లీ తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇదే సందర్భంగా బీబీఎంపీలోని బీజేపీ కార్పొరేటర్లకు గాలం వెయ్యడానికి కాంగ్రెస్ సిద్ధమైందని వెలుగు చూసింది. బెంగళూరుపై పూర్తి పట్టు సాధించేందుకు అధికార పార్టీ వ్యూహం రచించిందని తెలిసింది.

బెంగళూరు నగరం మీద పట్టుసాధించి బీజేపీని గట్టి దెబ్బ కొట్టాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ డిసైడ్ అయ్యారని తెలిసింది. బెంగళూరులోకి కేఆర్ పురం బీజేపీ ఎమ్మెల్యే బైరతి బసవరాజ్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే మాజీ బీబీఎంపీ మాజీ కార్పొరేటర్లు కాంగ్రెస్ టార్గెట్ లిస్టులో ఉన్నారని తెలిసింది. మాజీ కార్పొరేటర్లు బండే రాజు, పద్మావతి శ్రీనివాస్ మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రచురించింది.

Karnataka Deputy Chief Minister DK Sivakumar targeted former corporators of BBMP BJP

ఈ విషయాన్ని ఇటీవల కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను కలిసిన కేఆర్‌పురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి డీకే మోహన్‌ చర్చలు జరిపారని తెలిసింది. ఇదే సమయంలో డీకే మోహన్ తో పాటు, విజనాపుర వార్డుకు చెందిన కార్పోరేటర్లు బండేరాజు, రామమూర్తి నగర వార్డుకు చెందిన పద్మావతి శ్రీనివాస్‌, కేఆర్‌పురం వీరన్న తదితరులు ఈ విషయాన్ని ధృవీకరించారు.

మరికొద్ది రోజుల్లో కేఆర్ పురంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ జరగనుందని, ఆసందర్భంలో బీజేపీకి చెందిన మాజీ కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరనున్నారని తెలిసింది. ఈ విషయాన్ని మాజీ కార్పోరేటర్ బండే రాజు స్వయంగా ధృవీకరించారు. నేను బీజేపీకి చాలా నమ్మకమైన కార్యకర్తను. కానీ బైరతి బసవరాజ్ బీజేపీలో చేరిన తర్వాత బీజేపీ నాయకులు నన్ను విస్మరిస్తున్నారని, బైరతి బసవరాజ్ ను నెత్తిన పెట్టుకున్నారని బండే రాజు ఆరోపించారు.

నా మద్దతుదారులతో సమావేశం అయ్యాను, నన్ను కాంగ్రెస్‌లో చేరాలని నా మద్దతుదారులు కోరుతున్నారు, డీసీఎం డీకే శివకుమార్‌తో పాటు ఇతర నేతలను తాను కలిశాను. కాంగ్రెస్‌కు సేవ చేయాలనే ఆసక్తిని తాను వ్యక్తం చేశానని బండే రాజు అన్నారు. బసవనపుర వార్డు మాజీ కార్పొరేటర్‌, బైరతి బసవరాజ్‌ కు అత్యంత సన్నిహితుడు బీఎన్‌. జయప్రకాశ్‌ను కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు సంప్రదించారని, వారితో చర్చలు జరుగుతున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Karnataka Deputy Chief Minister DK Sivakumar targeted former corporators of BBMP BJP

దీంతో పాటు కేఆర్ పురం మాజీ ఎమ్మెల్యే నందీష్ రెడ్డితోపాటు పలువురు నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరనున్నారు. కేఆర్ పురం, యశవంత్‌పుర, ఆర్‌ఆర్‌ నగర్‌ లో చాలా బీబీఎంపీ వార్డులు ఉన్నాయి. అక్కడ గెలిచే సత్తా ఉన్న నాయకులను బీబీఎంపీ ఎన్నికల్లో రంగంలోకి దించాలని కాంగ్రెస్ వ్యూహం రచించింది. అలాగే, బీజేపీకి చెందిన చాలా మంది మాజీ కార్పొరేటర్లు ఈసారి ఓట్లు పొందడంలో విజయం సాధించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వర్గాలు చెబుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+