రాజకీయాలు పక్కన పెడితే..! అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి
బెంగళూరు: కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) కూటమి ప్రభుత్వం భవితవ్యం మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. శుక్రవారం మధ్యాహ్నం ఒకటిన్నరకల్లా బలపరీక్ష వ్యవహారాన్ని ముగించేయాల్సిందేనంటూ గవర్నర్ వజూభాయ్ వాలా స్పీకర్ రమేష్‌కుమార్, ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామిలకు అల్టిమేటం జారీ చేశారు. స్పీకర్ అర్ధాంతరంగా సభను వాయిదా వేయడాన్ని నిరసిస్తూ గురువారం రాత్రంతా శాసనసభలోనే నిద్రించిన భారతీయ జనతాపార్టీ సభ్యులను శుక్రవారం ఉదయం ఉప ముఖ్యమంత్రి జీ పరమేశ్వర పలకరించారు. వారితో కలిసి అల్పాహారం చేశారు. చాలాసేపు వారితో మాట్లాడుతూ సభలోనే గడిపారు.

రాజకీయాలు పక్కన పెడితే..`! అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి
బెంగళూరు: కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) కూటమి ప్రభుత్వం భవితవ్యం మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. శుక్రవారం మధ్యాహ్నం ఒకటిన్నరకల్లా బలపరీక్ష వ్యవహారాన్ని ముగించేయాల్సిందేనంటూ గవర్నర్ వజూభాయ్ వాలా స్పీకర్ రమేష్‌కుమార్, ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామిలకు అల్టిమేటం జారీ చేశారు. స్పీకర్ అర్ధాంతరంగా సభను వాయిదా వేయడాన్ని నిరసిస్తూ గురువారం రాత్రంతా శాసనసభలోనే నిద్రించిన భారతీయ జనతాపార్టీ సభ్యులను శుక్రవారం ఉదయం ఉప ముఖ్యమంత్రి జీ పరమేశ్వర పలకరించారు. వారితో కలిసి అల్పాహారం చేశారు. చాలాసేపు వారితో మాట్లాడుతూ సభలోనే గడిపారు.

బీజేపీ సభ్యులతో కలిసి అల్పాహారం..
ఈ ఉదయం ఏడు గంటల సమయంలో పరమేశ్వర శాసనసభ లాబీల్లో ఎంట్రీ ఇచ్చారు. బీజేపీ సభ్యులను చిరునవ్వుతో పలకరించారు. బాగా నిద్ర పట్టిందా? పిచ్చాపాటి మాట్లాడుతూ కాలక్షేపం చేశారా? అని అంటూ ఆయన వారిని పలకరించారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ పరామర్శించారు. మధుమేహం, రక్తపోటు ఉన్న సభ్యులు చాలామంది ఉన్నప్పటికీ.. ఏమాత్రం భయపడకుండా రాత్రంతా సభలోనే గడిపారని అంటూ ప్రశంసించారు.
బీజేపీ సభ్యులు ఆయనను సాదరంగా ఆహ్వానించారు. `ఇంకొక్కరోజే మీ ప్రభుత్వం ఉంటుంది. ఇక మా జమానా ఆరంభం అవుతుంది..` అంటూ బీజేపీ సభ్యులు ఉపముఖ్యమంత్రితో నవ్వుతూ చెప్పారు. బీజేపీ సభ్యులతో కలిసి లాబీల్లోనే అల్పాహారాన్ని స్వీకరించారు. ఇడ్లీ, వడ, కేసరీబాత్, బిసబేళ బాత్ లను వడ్డించారు.

రాజకీయాలను పక్కన పెడితే..
రాజకీయాలు, పార్టీల మధ్య విభేదాలను పక్కన పెడితే- బీజేపీ సభ్యుల్లో చాలామంది తనకు ఆప్తమిత్రులని పరమేశ్వర అన్నారు. ఈ సందర్భంగా ఆయన లాబీల్లో తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ భవిష్యత్తు, బలపరీక్ష వంటి ప్రశ్నలను తనకు అడగవద్దని ఆయన ముందే సూచించారు. `ఆఫ్ ది రికార్డ్` వంటి ప్రశ్నలు కూడా సంధించవద్దని పరమేశ్వర విలేకరులతో చెప్పారు. బీజేపీ సభ్యులను పలకరించడానికి తాను వచ్చానని, వారందరూ తనకు మిత్రులేనని అన్నారు. బీజేపీ సభ్యుల్లో ఉన్న వారిలో చాలామంది తనతో పాటు రాజకీయాల్లోకి వచ్చారని, తనతో పాటు తొలిసారిగా ఎంపికైన వారు ఉన్నారని చెప్పుకొచ్చారు.

Click it and Unblock the Notifications