Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కుమార స్వామికి బూమ్ రాంగ్ - ఏపీలో పవన్ భవిష్యత్ ఏంటి..!?

కింగ్ లేదా కింగ్ మేకర్ అవ్వాలి. కర్ణాటకలో కుమార స్వామి..ఏపీలో పవన్ కల్యాణ్ అభిమానులు తమ నేతల కోసం కోరుకొనే హోదా. కర్ణాటకలో హంగ్ ఏర్పడిన సందర్భాల్లో కుమార స్వామి కీలకం అయ్యారు. ఈ సారి అదే జరుగుతుందని అంచనా వేసారు. కానీ జేడీఎస్ నేతల ఆశలు బూమ్ రాంగ్ అయ్యాయి. ఇటు ఏపీలో పవన్ కల్యాణ్ కేంద్రంగా ఇప్పుడు రాజకీయం నడుస్తోది. తాను సీఎం పదవి కోసం వెంపర్లాడనని.. పదవే తనను వరించాలని కొత్త విశ్లేషణ చేసారు. కర్ణాటక ఫలితాలు..ఏపీలో జనసేన పాత్ర ఏంటనే చర్చ మొదలైంది.

జేడీఎస్ ..జనసేన:కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ బలమైన పార్టీ. బీజేపీ రాష్ట్రంలో పంజుకున్న తరువాత పొలిటికల్ వార్ కాంగ్రెస్ వర్సస్ బీజేపీగా మారిపోయింది. ఈ రెండు పార్టీల మధ్య జరిగే పోరాటంలో వచ్చే అస్పష్ట ఫలితాల వైపు జేడీఎస్ ఆశగా చూడటం ప్రారంభించింది. బలమైన కేడర్..ఓటర్లు ఉన్నా వాటిని అన్ని ప్రాంతాలకు విస్తరించటం..ఈ రెండు పార్టీలకు పోటీగా బలమైన వ్యూహాలు అమలు చేయటంలో నాయకత్వం విఫలమైన ట్లుగా తాజా ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. సీట్ల కేటాయింపులో మాజీ ప్రధాని దేవగౌడ కుటుంబంలో వచ్చిన విభేదాలు సామాన్యులను రుచించ లేదు. బీజేపీ..కాంగ్రెస్ ఎవరు అధికారంలోకి రావాలన్నా తమ మద్దతు లేకుండా సాధ్యం కాదనే ధీమా ఈ పార్టీ ఈ ఎన్నికల్లో బలమైన పోటీ ఇవ్వలేకపోవటానికి ప్రధాన కారణంగా విశ్లేషణలు ఉన్నాయి.

Karnataka Assembly Election Results 2023

పవన్ కల్యాణ్ తాజా నిర్ణయాలు: ఏపీలో ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో నిర్వహించే పాత్ర పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. తనను గెలిపించలేదని పదే పదే చెబుతున్న పవన్.. తనను గెలిపించేలా ప్రజలను ఎందుకు ప్రభావితం చేయలేకపోయారో సమీక్ష చేసుకోవటం లేదనే వాదన ఉంది. తనకు 2019 ఎన్నికల్లో కుమార స్వామికి గత ఎన్నికల్లో ఇచ్చిన విధంగా 35-40 సీట్లు ఇస్తే తాను సీఎం సీటు కోసం పట్టుబట్టే వాడినని పవన్ చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో అధికారంలో ఉన్న టీడీపీ నే 23 సీట్లకు ప్రజలు పరిమితం చేసారు. తమకు అప్పుడు 23 సీట్లు ఇచ్చారని టీడీపీ యుద్దం వదిలేయలేదు. తిరిగి అధికారంలోకి రావటం కోసం పోరాటం చేస్తోంది. ఇప్పుడు పవన్ ఆ యుద్దం చేయకుండా..తనకు ఓట్లు ఎందుకు పడలేదో సమీక్షించి సరిదిద్దుకోకుండా.. తన వైఫల్యం గుర్తించకుండా.. ప్రజలు తనకు ఓట్లు వేయని కారణంగానే తాను టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నాననే భావన కల్పిస్తున్నారనే అభిప్రాయం బలంగా ఉంది.

జనసేన భవిష్యత్ పై ప్రభావం: కర్ణాటకలో జేడీఎస్ ఈ ఎన్నికల్లో ఓడినా..కింగ్ మేకర్ అవుతామనే ఆశలు ఉన్నా..ఎన్నికల్లో ఒంటరిగానే పోరాటం చేసింది. మరో పార్టీ సమర్ధత పైన ఆధార పడలేదు. ఏపీలో తమకు బలం పెరిగిందని ఒక వైపు చెబుతూనే పవన్ కల్యాణ్..తాను ఎన్నికల్లో మాత్రం పొత్తులతోనే పోటీ చేస్తానని చెబుతున్నారు. ఇదే ఇప్పుడు వైసీపీకి పవన్ పైన ఆరోపణలకు అవకాశంగా మారుతోంది. ఇప్పుడు చంద్రబాబు అంగీకరిస్తేనే జనసేన నేతలకు సీట్లు. అసలు తనకు సీఎం పదవి టీడీపీ, బీజేపీ ఎందుకు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. సీఎం పదవి ఇచ్చేది టీడీపీ, బీజేపీ కాదు.. ప్రజలనే విషయం విస్మరిస్తున్నారు. సీఎం జగన్, చంద్రబాబు అధికారం కోసం గత కొన్నేళ్లుగా చేసిన.. చేస్తున్న పోరాటాలను చూస్తున్న పవన్..వారికి భిన్నంగా వ్యవహరిస్తున్న తీరుతో ప్రజల ఆదరణ ఏమేర నిలబెట్టుకుంటారనేది ఇప్పుడు చర్చకు కారణమవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+