Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అర్ధరాత్రి హైడ్రామా-ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు: సీఎంగా యెడ్డీ ప్రమాణం, ఊహించని పరిణామాలు

బెంగళూరు/ఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ రావడంతో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ వాజుభాయ్ వాలా ఆహ్వానించడంతో కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో గురువారం అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి బుధవారం రాత్రి వరకు కర్ణాటకలో హైడ్రామా కొనసాగింది. గవర్నర్ నిర్ణయంతో కాంగ్రెస్ - జేడీఎస్ సుప్రీంను ఆశ్రయించడంతో సీన్ ఢిల్లీకి కూడా మారింది.

Recommended Video

    ఘనంగా కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప
    Karnataka election results 2018 LIVE: Karnataka Drama, No Interim SC Order Yet as Arguments Continue

    May 17, 2018, 5:42 pm IST

    కర్ణాటక పరిస్థితుల నేపథ్యంలో గోవా, మణిపూర్ తదితర ప్రాంతాల్లో తమకు మెజార్టీ వచ్చినందున మేం ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పరేడ్ నిర్వహించనుంది.
    May 17, 2018, 2:38 pm IST

    కర్ణాటక గవర్నర్ ఆరెస్సెస్ వ్యక్తి అని, గుజరాత్‌లో మోడీ మంత్రివర్గంలో పని చేశారని, అందుకే కేంద్రం మాట వింటున్నారని అమరీందర్ సింగ్ అన్నారు.
    May 17, 2018, 2:37 pm IST

    కర్ణాటక గవర్నర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్తున్నారని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అతను నడుచుకుంటున్నాడని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ అన్నారు.
    May 17, 2018, 2:31 pm IST

    యడ్యూరప్ప ప్రభుత్వ ఏర్పాటుపై రామ్ జెఠ్మలాని సుప్రీం కోర్టుకు, కర్ణాటకలో మరో న్యాయవాది హైకోర్టుకు వెళ్లారు.
    May 17, 2018, 2:09 pm IST

    కేసీఆర్, చంద్రబాబు, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ కలిసి రావాలని కుమారస్వామి అన్నారు.
    May 17, 2018, 2:08 pm IST

    మా ఎమ్మెల్యేలను కాపాడుకుంటామని కుమారస్వామి వెల్లడించారు.
    May 17, 2018, 1:32 pm IST

    గవర్నర్ వ్యవస్థను మోడీ మిస్ యూజ్ చేస్తున్నారని డీఎంకే నేత స్టాలిన్ అన్నారు.
    May 17, 2018, 1:32 pm IST

    బస్సులో ఈగల్టన్ రిసార్టుకు వస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
    May 17, 2018, 1:31 pm IST

    కర్ణాటక గవర్నర్ తీరుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఆశ్రయిస్తానని రామ్ జెఠ్మలానీ చెప్పారు.
    May 17, 2018, 1:19 pm IST

    దేశంలో పరిస్థితి పాకిస్తాన్ మాదిరిగా తయారయిందని రాహుల్ గాంధీ మండిపడ్డారు.
    May 17, 2018, 1:16 pm IST

    జేడీఎస్ అధినేత దేవేగౌడ తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబులకు ఫోన్ చేశారు. తమ పోరాటానికి మద్దతివ్వాలని కోరారు.
    May 17, 2018, 1:06 pm IST

    రాజ్యాంగాన్ని అవమానించేలా కర్ణాటక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని మాయావతి మండిపడ్డారు.
    May 17, 2018, 1:04 pm IST

    మాకు మెజార్టీ ఉందని, ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే నమ్మకం ఉందని, వంద శాతం మా ఎమ్మెల్యేలు మా వెంటే ఉన్నారని కాంగ్రెస్ నేత శివకుమార్ అన్నారు.
    May 17, 2018, 1:00 pm IST

    కర్ణాటకలో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రొటం స్పీకర్‌గా కాంగ్రెస్ సీనియర్ ఆర్వీ దేశ్ పాండే కానున్నారు. అప్పుడు యడ్యూరప్పకు మెజార్టీ నిరూపించుకోవడం కష్టమే అవుతుందని అంటున్నారు.
    May 17, 2018, 12:50 pm IST

    మా ఎమ్మెల్యేలు మాతోనే ఉన్నారని, రేపు కూడా నిరసన తెలుపుతామని మల్లికార్జున ఖర్గే అన్నారు.
    May 17, 2018, 12:43 pm IST

    118 మంది జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని సిద్ధరామయ్య చెప్పారు.
    May 17, 2018, 12:09 pm IST

    కర్ణాటకలో ఓవైపు ఎమ్మెల్యేలు, మరోవైపు గవర్నర్ ఉన్నారని, బీజేపీ తమ ఎమ్మెల్యేలను రూ.100 కోట్లకు కొనుగోలు చేస్తోందని జేడీఎస్ ఆరోపించిందని రాహుల్ గాంధీ అన్నారు.
    May 17, 2018, 12:08 pm IST

    కర్ణాటకలో ప్రజాస్వామ్యం హత్య చేయబడిందని రాహుల్ గాంధీ మండిపడ్డారు.
    May 17, 2018, 12:00 pm IST

    బీజేపీది మూణ్ణాళ్ల ముచ్చటేనని కుమారస్వామి అన్నారు.
    May 17, 2018, 11:34 am IST

    కాంగ్రెస్ పార్టీ నిరసనలో కుమారస్వామి కలిశారు.
    May 17, 2018, 11:33 am IST

    యడ్యూరప్ప గ్రామంలో సంబరాలు మిన్నంటాయి.
    May 17, 2018, 11:32 am IST

    మోడీ ప్రభుత్వం కేంద్ర విచారణ సంస్థలతో బెదిరిస్తోందని కుమారస్వామి అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ తమతో చెప్పారని, నన్ను నేను రక్షించుకోవాల్సి ఉంటుందని చెప్పారని కుమారస్వామి తెలిపారు.
    May 17, 2018, 11:09 am IST

    తాము రుణాలు మాఫీ చేస్తామని యడ్యూరప్ప ప్రకటించారు.
    May 17, 2018, 11:02 am IST

    యెడ్డీ మూడోసారి సీఎం అయ్యారని, అతని ప్రభుత్వం అయిదేళ్ల పాటు బాధ్యతతో వ్యవహరిస్తుందని అనంత్ కుమార్ తెలిపారు.
    May 17, 2018, 11:01 am IST

    నా తండ్రి కుమారస్వామి జోక్యం చేసుకొని అన్ని ప్రాంతీయ పార్టీలతో మాట్లాడాలని, బీజేపీ వైఖరి అందరికీ చెప్పాలని కుమారస్వామి అన్నారు.
    May 17, 2018, 11:00 am IST

    నా అభిప్రాయం మేరకు కాంగ్రెస్-జేడీఎస్ చెప్పినట్లుగా అత్యవసరంగా సుప్రీంలో విచారణ అవసరం లేదని ముకుల్ రోహిత్గీ అన్నారు.
    May 17, 2018, 10:59 am IST

    బీజేపీకి మెజార్టీ లేదని, వారు తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూస్తున్నారని, గవర్నర్ ఇలా ఎలా వ్యవహరిస్తారని కుమారస్వామి వ్యాఖ్యానించారు.
    May 17, 2018, 10:58 am IST

    విధానసభకు యెడ్డీ
    May 17, 2018, 10:49 am IST

    బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న తీరును అన్ని ప్రాంతీయ పార్టీలతో కలిసి దేశ వ్యాప్తంగా ఎండగడతామని కుమారస్వామి అన్నారు.
    May 17, 2018, 10:47 am IST

    తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాల నుంచి కాపాడుకుంటామని జేడీఎస్ నేత కుమారస్వామి తెలిపారు.
    READ MORE

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+