వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నాటక: గవర్నర్ వద్దకు కాంగ్రెస్-జేడీఎస్, నో చెప్తే కోర్టుకు, పదవుల పంపకు పూర్తి

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్నాటక రాజకీయం రసవత్తరంగా మారింది. హంగ్ ఏర్పడటంతో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ కాంగ్రెస్ - జేడీఎస్ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీకి అధికారం దక్కవద్దనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్.. జేడీఎస్‌కు సీఎం పదవి అప్పగించేందుకు సిద్ధమైంది. ఈ ఆఫర్‌కు జేడీఎస్ ఓకే చెప్పింది.

జేడీఎస్ నేతలు మధ్యాహ్నం భేటీ అయ్యారు. పార్టీ అధినేత కుమారస్వామి అభిమానులకు చేయి ఊపుతూ ఇంటి నుంచి బయటకు వచ్చారు. జేడీఎస్ - కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడనుండటంతో ఇరు పార్టీల నేతలు గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు.

Karnataka election results 2018 LIVE: Kumaraswamy sends letter to governor to invite him to form government

అయితే, అంతకుముందు గవర్నర్ వారికి అపాయింటుమెంట్ తిరస్కరించినట్లుగా ప్రచారం జరిగింది. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడక ముందు వారు అపాయింటుమెంట్ అడగడంతో ఫలితాల అనంతరమని చెప్పారని తెలుస్తోంది. ఒకవేళ గవర్నర్ తమకు అపాయింటుమెంట్ ఇవ్వకుంటే కాంగ్రెస్ కోర్టుకు వెళ్లేందుకైనా సిద్ధపడిందని తెలుస్తోంది.

మరోవైపు, ఫలితాల అనంతరం కాంగ్రెస్, జేడీఎస్‌లు గవర్నర్‌కులేఖ పంపించాయి. తమకు సంపూర్ణ మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని లేఖ పంపించారు. అనంతరం వారు ఐదున్నర గంటలకు వారు గవర్నర్‌తో భేటీ కానున్నారు. కాగా, ఇప్పటికే గవర్నర్ భవన్ వద్దకు వెళ్లిన జేడీఎస్ నేతలు కుపేంద్ర రెడ్డి, రమేష్ బాబు, శరవణన్‌లు వెళ్లారు. వారిని లోపలకు అనుమతించలేదని తెలుస్తోంది.

పదవుల పంపకం

కాగా, జేడీఎస్‌కు కాంగ్రెస్ పార్టీ బయటి నుంచి మద్దతివ్వాలని భావించింది. కానీ జేడీఎస్ అందుకు అంగీకరించలేదు. దీంతో జేడీఎస్ -కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాలని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి, కాంగ్రెస్‌కు ఉప ముఖ్యమంత్రి, స్పీకర్ పదవి. అలాగే మంత్రి పదవులను పంచుకోనున్నారు.

English summary
JDS Kumaraswamy sends letter to governor to invite him to form government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X