కర్ణాటకలో హంగ్: ఆయనే కింగ్ మేకర్
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగింసింది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ఆరంభమైంది. సాయంత్రం 6:30 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 5 గంటల వరకు 65.69 మేర పోలంగ్ శాతం నమోదైనట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా వెల్లడించింది. పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఎన్నికల సిబ్బంది ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు సీల్ వేశారు.
ఈ నెల 13వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపును షెడ్యూల్ అయింది. పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఆరంభం అయ్యాయి. వివిధ న్యూస్ ఛానళ్లు ఇదివరకే తాము నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ క్రమంగా వెలువడిస్తోన్నాయి. ఈ ఎన్నికల్లో కన్నడిగులు ఏ పార్టీకి పట్టం కట్టారనే విషయంపై అంచనాలను విడుదల చేస్తోన్నాయి. ఈ నెల 13వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు అనంతరం- ఏ పార్టీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనడంపై ప్రజాభిప్రాయాన్ని వెల్లడిస్తోన్నాయి.

రిపబ్లిక్ టీవీ- పీ మార్క్ ప్రసారం చేసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. కర్ణాటకలో మరోసారి హంగ్ అసెంబ్లీ ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఏ పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ దక్కదు. కర్ణాటకలో అధికారంలోకి రావడానికి 113 సీట్లు అవసరమౌతాయి. ఈ సంఖ్యను ఏ పార్టీ కూడా అందుకోలేదని రిపబ్లిక్ టీవీ-పీ మార్క్ తెలిపింది.
సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ ఆవిర్భవిస్తుందని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 94 నుంచి 108 వరకు సీట్లు దక్కుతాయని తెలిపింది. భారతీయ జనతా పార్టీ 85 నుంచి 100 సీట్లకు పరిమితమౌతుందని పేర్కొంది. ఇక జనతాదళ్ (సెక్యులర్) 24 నుంచి 32 స్థానాలు సాధిస్తుందని అంచనా వేసింది. దీని ప్రకారం చూసుకుంటే- జనతాదళ్ (సెక్యులర్) మరోసారి కింగ్ మేకర్ పాత్రను పోషించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇతరులు 2 నుంచి 6 స్థానాల వరకు దక్కించుకుంటారు.
కుమారస్వామి సారథ్యంలోని జేడీఎస్ ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని రిపబ్లిక్ టీవీ-పీ మార్క్ స్పష్టం చేసింది. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ కూటమి ప్రభుత్వం మరోసారి కర్ణాటకలో ఏర్పాటయ్యే అవకాశాలు లేకపోలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని నెలకొల్పాయి. ఆ తరువాత జరిగిన ఆపరేషన్ లోటస్ వల్ల ప్రభుత్వం కుప్పకూలింది.












Click it and Unblock the Notifications