Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కర్ణాటక ఎన్నికలు.. తెలుగు రాష్ట్రాల్లో జోరుగా బెట్టింగ్ లు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు రేపు జరుగనున్నాయి .బిజెపి,కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించి అధికారం కోసం తలపడుతున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 50 మిలియన్లకు పైగా ఓటర్లు ఉన్నారు. మే పదో తేదీన పోలింగ్ జరగనుండగా ,13వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.

కర్ణాటక ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలని ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ అగ్రనాయకులు భారీ ఎత్తున ప్రచారం నిర్వహించి తమదైన మేనిఫెస్టోలో ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేశారు.కర్ణాటక ఎన్నికలలో విచ్చల విడిగా ధనప్రవాహం కూడా సాగింది. ఇక రేపు జరగనున్న పోలింగ్లో ప్రజలు ఎవరివైపు నిలబడతారు అనేది తెలియనుంది.

Karnataka elections.. crores of rupees bettings

అయితే కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో విజయం ఎవరిది అన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.అంతేకాదు రేపు జరగనున్న కర్ణాటక ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లో జోరుగా బెట్టింగ్ లు కొనసాగుతున్నాయి. అప్పుడే బీజేపీ గెలుస్తుందని కొందరు,కాంగ్రెస్ గెలుస్తుందని మరికొందరు, జేడీఎస్ వైపు ఇంకొందరు జోరుగా పందేలు కాస్తున్నారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? వంటి విషయాలపై విశ్లేషణలు చేస్తున్నారు.

ఎన్నికలు జరిగే కర్ణాటక రాష్ట్రంలోనే కాక తెలుగురాష్ట్రాల్లోనూ పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి ఎన్నికలు. అందుకే జోరుగా బెట్టింగ్ లు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటక ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని భీమవరం లో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నట్లు తెలుస్తుంది.ప్రధానంగా కాంగ్రెస్, బిజెపి, జేడీఎస్ లు అధికారం తమదంటే తమదని అంచనాలు వేస్తుంటే, బెట్టింగ్ రాయుళ్ళు కూడా తమదైన అంచనాలతో కోట్ల రూపాయల బెట్టింగ్ లకు పాల్పడుతున్నారు.

దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న కర్ణాటక ఎన్నికల పోలింగ్ రేపు ఏ విధంగా సాగుతుంది? ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది? అన్నది ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠకు కారణమవుతుంది. ఈ ఎన్నికల ఫలితాలు భవిష్యత్ పార్లమెంట్ ఎన్నికలపైన కూడా ప్రభావం చూపిస్తుందని అందరూ భావిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+