వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విధాన సౌధలో మంత్రి రాసలీలలు: వీడియో విడుదల, రాజీనామా

విదాన సౌధలో (అసెంబ్లీ) మహిళలతో రాసలీలు సాగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ఎక్సైజ్ శాఖా మంత్రి హెచ్. వై. మేటి బుధవారం ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇంటికి వెళ్లిన హెచ్.వై.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: విదాన సౌధలో (అసెంబ్లీ) మహిళలతో రాసలీలు సాగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ఎక్సైజ్ శాఖా మంత్రి హెచ్. వై. మేటి తన మంత్రి పదవికి బుధవారం (డిసెంబర్ 14) రాజీనామా చేశారు.

బుధవారం ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇంటికి వెళ్లిన హెచ్.వై. మేటీ తన రాజీనామ లేఖను ఇచ్చి ముఖం మీద టవల్ వేసుకుని మీడియా కంటపడకుండా అక్కడి నుంచి చిన్నగా జారుకున్నారు. బుధవారం ఓ ప్రయివేట్ (కన్నడ) టీవీ చానల్ లో మేటీ రాసలీలల చిత్రాలను ప్రసారం చేసింది.

Karnataka Excise Minister, Y Meti today resigned over sex tape controversy.

కర్ణాటకతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు ఆ దృశ్యాలు చూశారు. అందులో మంత్రి మేటి ఉన్న విషయం స్పష్టంగా కనపడింది. అంతకు ముందు ఈ వీడియోని చిత్రీకరించిన ఆర్ టీఐ కార్యకర్త రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవడానికి ఢిల్లీ వెళ్లారు.

రాహుల్ గాంధీతో చర్చించిన తరువాత వీడియో విడుదల చెయ్యాలని నిర్ణయించారు. అయితే రాహుల్ గాంధీని ఆర్ టీఐ కార్యకర్త కలిశారా ? లేదా ? అనే విషయం బయటకు రాకముందే ఢిల్లీలో వీడియె విడుదల చేశారు. కన్నడ టీవీ చానెల్ లో ఆ వీడియోలోని దృశ్యాలు ప్రసారం చేసేశారు.

Karnataka Excise Minister, Y Meti today resigned over sex tape controversy.

ఆ వీడియో క్లిప్పిగ్స్ అందరూ చూడటంతో కాంగ్రెస్ నాయకులు కంగుతిన్నారు. నేను ఏ తప్పు చెయ్యలేదని, తాను రాజీనామా చెయ్యడానికి సిద్దంగా ఉన్నానని మంత్రి మేటీ చెబుతున్న సమయంలో ఆ వీడియో బయటకు రావడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడింది.

English summary
Karnataka Excise Minister, Y Meti today resigned over sex tape controversy. RTI activist Rajashekar released sleaze video in New Delhi which had HY Meti in compromising position witha woman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X