వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెజార్టీ ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్‌కే ఎక్కువ సీట్లు: జెడి (ఎస్) నిర్ణయమే కీలకం

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో శనివారం నాడు జరిగిన ఎన్నికల్లో పలు ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లను కైవసం చేసుకొంటుందని తేల్చి చెప్పాయి. రెండవ అతి పెద్ద పార్టీగా బిజెపి విజయం సాధిస్తోందని ఈ సర్వే ఫలితాలు వెల్లడించాయి అయితే ఏ పార్టీ కూడ స్పష్టమైన మెజారిటీ సీట్లను కైవసం చేసుకోబోవని తేల్చి చెప్పాయి.

కర్ణాటక అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లను కైవసం చేసుకొంటుందని ఎగ్జిట్ పోల్స్ సర్వే పలితాలు వెల్లడించాయి. అయితే ప్రభుత్వ ఏర్పాటులో జెడి (ఎస్) కీలకంగా మారే అవకాశం ఉంది.

సీ ఓటర్ సర్వే ప్రకారంగా కాంగ్రెస్ పార్టీకి 87 నుండి 99 సీట్లు దక్కనున్నాయి. బిజెపికి 97 నుండి 109 సీట్లు దక్కనున్నాయి. జెడిఎస్ కు 21 నుండి 30 సీట్లు దక్కనున్నాయి.

Karnataka Exit Poll Results LIVE Updates: Most Exit Polls Give Edge to Congress With Over 100 Seats, BJP Close Second

ఇండియా టూడే యాక్సిస్ సర్వే ప్రకారంగా కాంగ్రెస్ పార్టీకి 106 నుండి 118 సీట్లు దక్కనున్నాయి. బిజెపికి 72 నుండి 92 సీట్లు దక్కనున్నాయి.జెడి(ఎస్)కు 22 నుండి 30 సీట్లు దక్కనున్నాయి. ఇతరులకు 1 నుండి 4 సీట్లు రానున్నాయి.

జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారంగా బిజెపికి 95 నుండి 114 సీట్లు దక్కనున్నాయని తేల్చింది.. కాంగ్రెస్ పార్టీకి 73 నుండి 82 సీట్లు దక్కుతాయని తేల్చింది.జెడి(ఎస్)కు 32 నుండి 43 సీట్లు వస్తాయని ఈ సర్వే తేల్చింది.ఇతరులకు రెండు నుండి మూడు సీట్లు దక్కే అవకాశం ఉందని ఈ సర్వే తేల్చింది.

English summary
Karnataka election latest updates: Most exit polls have predicted a majority for Congress while only one of them have given an edge to BJP. The Bharatiya Janata Party comes close second with 80-90 seats in the 224-member Karnataka Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X