దెబ్బకు దెబ్బ, రీ ఎంట్రీతో కేంద్ర మంత్రికి షాక్ ఇచ్చిన మాజీ సీఎం, ఆ రోజు చేసిన పనికి ?
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీల్లో ప్రిపరేషన్ల, టికెట్ కేటాయింపు, గెలుపు వ్యూహాలు, ఎవరికి ఏ నియోజకవర్గం ఇవ్వాలి? ఇలా పలు చర్చలు జరుగుతున్నాయి. కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్ పార్టీలు పొత్తు పెట్టుకుని లోక్ సభ ఎన్నికలకు సిద్దం అవుతున్నాయి. అయితే కాంగ్రెస్ లోకి వెళ్లి కొన్ని నెలల్లోనే బీజేపీలోకి అడుగుపెట్టిన మాజీ సీఎం దెబ్బతో కేంద్ర మంత్రికి సినిమా కనపడింది.
జేడీఎస్ తో పొత్తు పెట్టుకున్న తరువాత కూడా రెండు ప్రధాన లోక్ సభ నియోజకవర్గాల అభ్యర్థులను మార్చాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలిసింది. కాంగ్రెస్ లో చేరిన కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ మళ్లీ బీజేపీలోకి వచ్చిన తర్వాత మారిన కొన్ని పరిణామాలు, కులాల లెక్కల ప్రకారం బీజేపీ లెక్కలు మొదలయ్యాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జగదీష్ శెట్టర్‌ను తిరిగి పార్టీలోకి తీసుకురావడానికి బీజేపీ హైకమాండ్ ఆయనకు కొన్ని ఆఫర్లు, కీలక పదవిని ఇస్తామని హామీ ఇచ్చిందని తెలిసింది.

ధారవాడ లోక్ సభ నియోజకవర్గం టికెట్ మాజీ సీఎం జగదీష్ శెట్టర్ కు ఇవ్వాలన్న ఆఫర్ కూడా ఉందని తెలిసింది. మాజీ సీఎం జగదీష్ శెట్టర్ ధారవాడ నుంచి పోటీ చేస్తే ఆనియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుత ఎంపీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అంటూ బీజేపీ వర్గాలు ఆశ్చ్యం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే ధారవాడలో ప్రహ్లాద్ జోషి మద్దతుదారుల ఆందోళనకు కూడా కారణమైంది.
ఇప్పుడు ఈ ప్రశ్నకు కూడా సమాధానం దొరికింది. ధారవాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి జగదీశ్ శెట్టర్ కు ఇచ్చే అవకాశం ఉంది. మరో బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే నియోజకవర్గం అయిన ఉత్తర కన్నడ టికెట్ ప్రహ్లాద్ జోషికి దక్కుతుంది అని బీజేపీలోని కొందరు నాయకులు అంటున్నారు. లింగాయత్ ఓట్లపై కన్నేసిన బీజేపీ అన్ని లెక్కలు వేస్తోంది. ధారవాడ నియోజకవర్గంలో లింగాయత్ ఓట్లపై కన్నేసింది.

అయితే ప్రహ్లాద్ జోషిపై ఎలాంటి వివక్ష చూపకుండా ఉండేందుకు బీజేపీ రాష్ట్ర, జాతీయ నేతలు బ్రాహ్మణులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో బ్రాహ్మణ సంఘం నేత ప్రహ్లాద్ జోషిని బరిలోకి దింపాలని ఆలోచిస్తున్నారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రెండూ లోక్ సభ నియోజక వర్గాలు బీజేపీ గెలిచే నియోజకవర్గాలు కావడంతో ఎవరూ నిరాశ చెందకుండా చూసుకుని ఓటు బ్యాంకును బలోపేతం చేసుకోవాలని, తద్వారా ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్‌ను ఓడించాలని బీజేపీ నిర్ణయించింది.
మాజీ సీఎం జగదీష్ శెట్టర్ కు అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ దక్కకపోవడానికి, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణం అయిన నాయకుల్లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా భాగం అయ్యారని ఆరోపణలు ఉన్నాయి. జగదీష్ శెట్టర్ కాంగ్రెస్ లో చేరిన తరువాత ఆయన వలన బీజేపీకి ఏమాత్రం నష్టం లేదని, శెట్టర్ ప్రభావం బీజేపీ కార్యకర్తల మీదపడదు అంటూ కేంద్ర మంత్రి ప్లహ్లాద్ జోషి అన్నారు. అయితే అదే ప్రహ్లాద్ జోషి ఎంపీ టిక్కెట్ కు ఎసరు పెట్టిన మాజీ సీఎం జగదీష్ శెట్టర్ ఇప్పుడు ప్రహ్లాద్ జోషి మరో నియోజక వర్గానికి వెళ్లడానికి కారణం అవుతున్నారు.
అనంత్ కుమార్ హెగ్డే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే ప్రశ్న మొదలైయ్యింది. జగదీష్ శెట్టర్ మళ్లీ పార్టీలోకి వస్తే తమకు అభ్యంతరం లేదని చెప్పిన ప్రహ్లాద్ జోషికి నియోజకవర్గం లేని పరిస్థితి ఎదురవుతుంది. గత నాలుగున్నరేళ్లలో అనంత్ కుమార్ హెగ్డే ఎక్కడా కనిపించలేదు. అయితే లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నస సమయంలో కొన్ని రోజుల క్రితం ప్రజల ముందు ప్రత్యక్షం అయిన బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే కర్ణాటక సీఎం సిద్దరామయ్యను ఏకవచనంతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడ్డారు.

నేరుగా హిందువులకు అనుకూలంగా మాట్లాడిన అనంతకుమార్ హెగ్డే ఎంపీ సీటు దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం సిద్దరామయ్యకు సవాల్ చేస్తూ వార్తల్లో నిలిచిన హెగ్డే వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఆయన వ్యక్తిగత ప్రకటన అని బీజేపీ స్పష్టం చేసింది. దీని తర్వాత అనంత్ కుమార్ హెగ్డేకి బీజేపీ షాక్ ఇచ్చే అవకాశం ఉంది. ఎంపీగా గెలిచిన తరువాత రాజకీయంగా తెరపైకి రాని ఎంపీ అనంత్‌కుమార్ హెగ్డేకి మరోసారి ఎంపీ టికెట్ ఇవ్వకూడదని బీజేపీ నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు చెబుతున్నారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications