బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్ణాటక సీఎం కుమారస్వామి మీద సిద్దరామయ్య ఫైర్, ధర్మం తెలీదు, పాఠం చెబుతా!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో వార్ మొదలైయ్యింది. కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వంలోని ధర్మాన్ని పాటించడం లేదని, ఆయనకు పాఠం చెబుతానని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య బహిరంగంగా విమర్శించారు.

కాంగ్రెస్ మద్దతు లేదా?

కాంగ్రెస్ మద్దతు లేదా?

సంకీర్ణ ప్రభుత్వం ధర్మాన్ని సీఎం హెచ్.డి. కుమారస్వామికి వివరిస్తానని సిద్దరామయ్య చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఉందనే విషయం కొందరు మరచిపోయారని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మండిపడ్డారు.

యూనివర్శిటీ పదవులు

యూనివర్శిటీ పదవులు

విశ్వవిద్యాలయాల నామినేటెడ్ సభ్యులను తొలగించిన విషయంపై మాజీ సీఎం సిద్దరామయ్య సీరియస్ అయ్యారు. కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి, ఉన్నత విద్యా శాఖా మంత్రి జీటీ. దేవేగౌడ కావాలనే విశ్వ విద్యాలయాల నామినేటెడ్ సభ్యులను తొలగించారని సిద్దరామయ్య ఆరోపించారు.

ఆ ఇద్దరు కారణం

ఆ ఇద్దరు కారణం

కాంగ్రెస్ పార్టీలోని ఇద్దరు నాయకుల తీరుతోనే కుమారస్వామి, ఉన్నత విద్యా శాఖా మంత్రి జీటీ. దేవేగౌడ ఈ నిర్ణయం తీసుకున్నారని పరోక్షంగా ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్, మంత్రి డీకే. శివకుమార్ మీద సిద్దరామయ్య ఆరోపణలు చేశారు.

అధికారం ముఖ్యం కాదు!

అధికారం ముఖ్యం కాదు!

మా పార్టీని వాళ్లకు అధికారం ముఖ్యం అయ్యిందని డాక్టర్ జీ. పరమేశ్వర్, డీకే. శివకుమార్ మీద సిద్దరామయ్య విరుచుకుపడ్డారు. అధికారంతో పార్టీ పార్టీ కార్యకర్తలు ముఖ్యం అని, వారిని నిర్లక్షం చెయ్యరాదని, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు చూడాలని సిద్దరామయ్య అన్నారు.

సిద్దూకు విలువ లేదు

సిద్దూకు విలువ లేదు

సమన్వయ సమితి సమావేశంలో నామినేటె్ పదవుల విషయంపై చర్చిస్తానని మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు. విశ్వ విద్యాలయాల నామినేట్ సభ్యులను తొలగించరాదని సిద్దరామయ్య సీఎం కుమారస్వామి, మంత్రి జీటీ. దేవేగౌడకు లేఖ రాసినా వారు పట్టించుకోలేదు. మాజీ సీఎంకు విలువ లేదని సొంత పార్టీలో చర్చ మొదలు కావడంతో సిద్దరామయ్య తన ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
Karnataka former chief minister siddaramaiah is very upset with the govt regarding new syndicate members. He warns the chief minister that will teach coalition dharma in next coordination meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X