Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కరోనా వైరస్ మహమ్మారికి విరుగుడు మందు కనిపెట్టిన సీఎం ఇబ్రహీం, చెప్పింది చెయ్యండి, రింగ్ టోన్ కాదు !

బెంగళూరు: ప్రపంచంలోని వందకుపైగా దేశాల్లో వేంగా విస్తరించిన కరోనా వైరస్ (కోవిడ్ -19) పేరు వింటేనే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని హడలిపోతున్నారు. ప్రపంచ దేశాల్లోని పేరుపొందిన శాస్త్రవేత్తలు, ప్రముఖ డాక్టర్లు సైతం ఇప్పటి వరకు కరోనా వైరస్ వ్యాధి పూర్తిగా నయం చేసే మందు (మెడిసన్) కనిపెట్టడానికి నానా తంటాలు పడుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే పనిలో శాస్త్రవేత్తలు తలమునకలైనారు. అయితే కరోనా వైరస్ వ్యాధి వ్యాపించకుండా ఉండటానికి చక్కటి ఔషదం ఉందని, దానిని మీరు ఫాలో కావాలని కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సీఎం ఇబ్రహీం సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి చెప్పిన ఔషదం ఎలా ఉపయోగించాలో అనే ఓ టిక్ టాక్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

కరోనా కట్టడికి Anti-HIV డ్రగ్స్ !

కరోనా కట్టడికి Anti-HIV డ్రగ్స్ !

చైనా, భారత్ లోని జైపూర్ లో ప్రముఖ శాస్త్రవేత్తలు కరోనా వైరస్ కట్టడికి Anti-HIV డ్రగ్స్ ఉపయోగించారు. అయితే శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు మాత్రం ఇప్పటి వరకు ఏవీ ఫలించలేదు. ప్రపంచంలోని వైద్యులకే సవాలుగా మారిన కరోనా వైరస్ ను కట్టడి చెయ్యడానికి వందలాది దేశాల్లోని శాస్త్రవేత్తలు పగలు రాత్రి శక్తి వంచన లేకుండా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు.

సీఎం ఇబ్రహీం ఎమన్నారంటే ?

సీఎం ఇబ్రహీం ఎమన్నారంటే ?

కరోనా వైరస్ వ్యాధి కట్టడి చెయ్యడానికి మీరు ఇంట్లోనే చక్కటి ఔషదం (మెడిసన్) తయారు చేసుకోవడానికి అవకాశం ఉందని కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సీఎం ఇబ్రహీం అన్నారు. తాను చెప్పినట్లు మీరు చేస్తే కరోనా వైరస్ వ్యాధి మీ దరిదాపులకు రాదని, నేను చెప్పినట్లు మీరు వినాలి అంతే అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సీఎం ఇబ్రహీం చెప్పారు.

చైనా, ఇటలీని చూడండి

చైనా, ఇటలీని చూడండి

చైనా, ఇటలీలో అత్యున్నత టెక్నాలజీ ఉపయోగించి కరోనా వైరస్ వ్యాధిని కట్టడి చెయ్యడానికి విఫలయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి సీఎం ఇబ్రహీం అన్నారు. భారతదేశంలో పేరుపొందిన ప్రముఖ శాస్త్రవేత్తలు ఉన్నారని, వారందరు మరింత దృష్టి కేంద్రీకరించి కరోనా వైరస్ వ్యాధి విరుగుడుకు మందు కనిపెట్టాల్సిన సమయం వచ్చిందని మాజీ మంత్రి సీఎం ఇబ్రహీం అన్నారు.

రింగ్ టోన్ పెడితే సరిపోతుందా ?

రింగ్ టోన్ పెడితే సరిపోతుందా ?

మొబైల్ ఫోన్ కంపెనీల మీద ఒత్తిడి చేసి కాలర్ ట్యూన్ గా కరోనా వ్యాధిని నివారించండి అంటూ సలహాలు ఇస్తే ఏం ఫలితం ఉంటుందని మాజీ మంత్రి సీఎం ఇబ్రహీం కేంద్ర ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాధిని నివారించడానికి ఎంత ఖర్చు అయినా భరించడానికి సిద్దం కావాలని, దేశం, ప్రజలకంటే ఏదీ ముఖ్యం కాదని మాజీ మంత్రి సీఎం ఇబ్రహీం తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

కరోనా వైరస్ కు విరుగుడు మందు ఇదే !

కరోనా వైరస్ కు విరుగుడు మందు ఇదే !

కరోనా వ్యాధిని అరికట్టడానికి మీ ఇంటిలోనే ఔషదం తయారు చేసుకోవచ్చని కర్ణాటక మాజీ మంత్రి సీఎం ఇబ్రహీం అన్నారు. ఒక్క ఉల్లిపాయ (onion) కట్ చేసి దానికి తగినంత ఉప్పు కలుపుకుని రోజుకు మూడు సార్లు తింటే కరోనా వైరస్ వ్యాధి మీ దరిదాపులకు కూడా రాదని మాజీ మంత్రి సీఎం ఇబ్రహీం అన్నారు. ఇంటిలో కుర్చుని ప్రతి ఒక్కరూ రోజుకు మూడు సార్లు ఉల్లిపాయకు ఉప్పు కలుపుకుని తినాలని, కరోనా వైరస్ వ్యాధికి దూరంగా ఉండాలని మాజీ మంత్రి సీఎం ఇబ్రహీం ఉచిత సలహా ఇచ్చారు.

టిక్ టాక్ వీడియో వైరల్

టిక్ టాక్ వీడియో వైరల్

కర్ణాటక మాజీ మంత్రి సీఎం ఇబ్రహీం ఇచ్చిన సలహాతో ఓ యువతితో టిక్ టాక్ వీడియో తయారు చేశారు. ఉల్లిపాయ ఎలా కట్ చెయ్యాలి ? దానికి ఎలా ఉప్పు జత చెయ్యాలి ? రోజుకు మూడు సార్లు ఎలా తినాలి అంటూ ఓ యువతి చూపిస్తున్న సలహాతో తీసిన ఉల్లిపాయ ఔషదం టిక్ టాక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటక రాజకీయాల్లో మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి సీఎం ఇబ్రహీం ఇచ్చిన ఉల్లిపాయ ఔషదంపై నేడు తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+