రెండు పార్టీలు గాలం వేశాయి, కాని ?, నేను మోనార్క్ అంటున్న రమ్యా మేడమ్ !

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ హీరోలు, హీరోయిన్ల ప్రచారం జోరందుకుంది. నటీనటులను చూడటానికి ప్రజలు ఎగబడుతున్నా ఓట్లు మాత్రం ఎవరికి వేస్తారు అనే విషయం అంతుచిక్కకపోవడంతో నాయకులు అయోమయంలో పడిపోతున్నారు. అయితే స్యాండిల్ వుడ్ బ్యూటీ రమ్యా రీ ఎంట్రీ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం ఊపందుకుంది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, ప్లహ్లాద్ జోషీ, స్మృతి ఇరానీతో పాటు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, స్టార్ హీరోలు సుదీప్, చాలెంజింగ్ స్టార్ దర్శన్, దిగంత్, అలనాటి హీరోయిన్లు తారా అనురాధ, శృతి తదితరులు బీజేపీ తరపున అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

 ramya-

కాంగ్రెస్ పార్టీ తరపున డాక్టర్ శివరాజ్ కుమార్, దునియా విజయ్ తదితరులు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. 2019 నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న మండ్య మాజీ ఎంపీ, స్యాండిల్ వుడ్ బ్యూటీ, బహుబాష నటి మే 1వ తేదీన ఆయారే మేడే హాయ్ హాయ్ అంటూ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చెయ్యడానికి సిద్దం కావడంతో ఆ పార్టీ నాయకులు జోరుమీద ఉన్నారు.

గత లోక్ సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ చార్జ్ గా జాతీయ స్థాయిలో రాజకీయాలు చేసి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి పని చేసి విఫలం అయిన నటి రమ్యా తరువాత ఊహించని పరిణామాలతో కాంగ్రెస్ పార్టీకి దూరం కావడంతో ఆ పార్టీలో తీవ్రస్థాయిలో చర్చ జరిగింది.

congress

కొంతకాలం క్రితం మాట్లాడిన నటి రమ్యా తనను బీజేపీలోకి కొందరు నాయకులు ఆహ్వానించారని, మంత్రి పదవి ఇస్తామని చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే తనను జేడీఎస్ పార్టీలోకి ఆహ్వానించారని, జేడీఎస్ లో కీలక పదవి ఇస్తామని హామీలు ఇచ్చారని, కాని ఆ రెండు పార్టీల్లో చేరడం తనకు ఇష్టం లేదని నటి రమ్యా చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.

తనను రాజకీయంగా ఆదరించిన కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలని అనుకున్నానని, కొందరు నాయకుల తీరుతో సొంతపార్టీకి దూరం అయినా ఇప్పుడు మళ్లీ వస్తున్నానని నటి రమ్యా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సూచించిన నియోజక వర్గాల్లో తాను ఎన్నికల ప్రచారం చేస్తానని, ఈసారి కర్ణాటకలో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నటి, మాజీ ఎంపి రమ్యా ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+