ఎన్నికల ఎఫెక్ట్, లిక్కర్ బ్యాన్ దెబ్బకు ప్రభుత్వానికి ఎన్ని వందల కోట్లు నష్టం అంటే !

బెంగళూరు/బెళగావి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే 10వ తేదీన పూర్తి అయ్యింది. కర్ణాటకలోని 224 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఒకే విడతలో పోలింగ్ నిర్వహించడంలో ఎన్నికల అధికారులు విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కర్ణాటక మొత్తం లిక్కర్ షాపులు మూసివేయడంతో కర్ణాటక ప్రభుత్వానికి భారీ మొత్తంలో నష్టం వచ్చిందని వెలుగు చూసింది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా మే 8వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి మే 11వ తేదీ ఉదయం 11 గంటల వరకు కర్ణాటక రాస్ట్రం మొత్తం మద్యం విక్రయాలు పూర్తిగా నిలిపివేశారు. రెండు రోజుల పాటు కర్ణాటకలోని లిక్కర్ షాపులకు, బార్ అండ్ రెస్టారెంట్లకు ఎక్సైజ్ శాఖ అధికారులు సీల్ వేశారు.

 beer-

కర్ణాటక రాష్ట్రం మొత్తం 12, 500 బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్ షాపులు, ఎంఆర్ పీ వైన్ షాపులు ఉన్నాయి, కర్ణాటకలో ప్రతిరోజు ఎక్సైజ్ శాఖకు సరాసరి రూ. 80 కోట్ల నుంచి రూ. 90 కోట్ల వరకు ఆదాయం ఉంటుందని తెలిసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా రెండు రోజుల పాటు మద్యం షాపులు మొత్తం మూసి వేయడంతో కర్ణాటక ప్రభుత్వానికి సుమారు రూ. 150 కోట్లకు పైగా ఆదాయానికి గండిపడిందని వెలుగు చూసింది.

కర్ణాటకలోని బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్ షాపుల్లో సరాసరి ఒక్కోషాపులో ఒక్కరోజు రూ. 1 లక్షా 50 వేలకు పైగా వ్యాపారం జరుగుతుంది. ఇక కర్ణాటక ప్రభుత్వానికి చెందిన ఎంఎస్ఐఎల్, ఎంఆర్ పీ షాపుల్లో ప్రతిరోజు సరాసరి రూ. 3 లక్షల వరకు వ్యాపారం జరుగుతోందని ఎక్సైజ్ శాఖ అధికారులు అంటున్నారు.

 whiskey

కర్ణాటకలోని 12, 500 మద్యం దుకాణాల్లో ప్రతిరోజు రూ. 187 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతోంది. ఈ విధంగా కర్ణాటక ప్రభుత్వానికి ప్రతిరోజు సుమారు రూ. 80 కోట్లకు పైగా ఆదాయం ఉంటుందని సంబంధిత అధికారులు అంటున్నారు. రెండు రోజులు మద్యం షాపులు మూసి వేయడంతో కర్ణాటక ఎక్సైజ్ శాఖతో పాటు బార్ అండ్ రెస్టారెంట్లు, బార్ ల యజమానులకు భారీగానే నష్టం వచ్చిందని వెలుగు చూసింది.

మే 13వ తేదీన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉండటంతో మే 12వ తేదీ రాత్రి నుంచి మే 14వ తేదీ ఉదయం వరకు మరోసారి కర్ణాటకలో మద్యం దుకాణాలు మూతపడుతున్నాయి. మొత్తం మీద కర్ణాటకలో మద్యం విక్రయాల వలన ప్రతిరోజు భారీ మొత్తంలో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆధాయం వస్తోందని వెలుగు చూసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+