Kumbh Mela: సార్.... అక్కడి నుంచేనా, ఇక్కడికి వస్తే RT-PCR పరీక్ష, ఐసోలేషన్ లో !
బెంగళూరు/ హరిద్వార్: హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కుంభమేళాకు హాజరైన చాలా మంది భక్తులకు కరోనా పాజిటివ్ (COVID-19) అని వెలుగు చూడటంతో హరిద్వార్ కు వెళ్లిన వాళ్లు హడలిపోతున్నారు. గంగానదిలో కొన్ని లక్షల మంది పుణ్యస్నానాలు చెయ్యడం, వేలాది మందికి కరోనా వైరస్ వ్యాపించడంతో ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. కుంభమేళాకు హాజరైన ప్రతి ఒక్కరు తిరిగి రాష్ట్రానికి వచ్చిన తరువాత కచ్చితంగా RT-PCR (కోవిడ్) పరీక్షలు చేయించుకోవాలని, కరోనా పాజిటివ్ వస్తే ఐసోలేషన్ లో ఉండాలని, లేదంటే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ప్రభుత్వం హెచ్చరించింది.

పవిత్రమైన కుంభమేళా
ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి అర్ద కుంభమేళా, ప్రయోగలలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభమేళా జరుగుతుంది. హిందువులు చాలా మంది ఎంతో పవిత్రంగా భావించే కుంభామేళాకు హాజరై గంగానదిలో పవిత్రంగా పుణ్యస్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయని నమ్ముతుంటారు.

కుంభమేళాలో కరోనా కాటు
ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో జరుగుతున్న కుంభమేళాకు హాజరైన లక్షలాది మంది హిందువులు పవిత్రమైన గంగానదిలో పుణ్యస్నానాలు చేశారు. బుధవారం ఒక్కరోజు మాత్రమే హరిద్వార్ లో 525 మందికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. గత ఐదు రోజుల్లో హరిద్వార్ లో 2, 167 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కుంభమేళాకు హాజరైన భక్తులు హడలిపోతున్నారు.

లక్షలాధి మంది భక్తులు
హరిద్వార్ లో కుంభమేళాకు సుమారు 32 లక్షల మంది భక్తులు హాజరైనారని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఏప్రిల్ 14వ తేదీ బుధవారం మాత్రమే సుమారు 9 లక్షల మంది హరిద్వార్ చేరుకుని కుంభమేళాలో పాల్గొని గంగానదిలో పవిత్ర పుణ్యస్ననాలు చేశారని అధికారులు అంటున్నారు.

ఎంట్రీ ఇస్తే కోవిడ్ పరీక్షలు చేసుకోవాలి
కుంభమేళాకు హాజరైన కర్ణాటక వాసులు, ఇతర రాష్ట్రాల వాళ్లు కర్ణాటకలో అడుగుపెట్టిన తరువాత వారివారి ఇళ్లకు చేరుకుని కచ్చితంగా RT-PCR పరీక్షలు (కోవిడ్ పరీక్షలు) చేయించుకోవాలని, కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్లు కచ్చితంగా క్వారంటైన్ లో. ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స చేయించుకోవాలని, నెగటివ్ వచ్చిన వాళ్లు రెండు మూడు రోజుల తరువాత వారివారి కార్యకలాపాల్లో పాల్గోనాలని కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ కే. సుధాకర్ మనవి చేశారు.
Recommended Video

తేడా వస్తే సీన్ రివర్స్ అవుతుంది
కుంభమేళాకు వెళ్లి కోవిడ్ పరీక్షలు చేయించుకోకుండా ప్రజల్లో సంచరిస్తే అలాంటి వాళ్లు గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ హెచ్చరించారు. గత కొంత కాలంగా ఐటీ హబ్ బెంగళూరు సిటీతో పాటు కర్ణాటకలో కరోనా వైరస్ భరతనాట్యం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంలో కుంభమేళాకు వెళ్లి కరోనా వైరస్ ను తగిలించుకుని వచ్చి కర్ణాటక ప్రజలకు అంటించకుండా అక్కడి బీజేపీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications