ఆర్టీసీ బస్సుల్లో ఇష్టం వచ్చినట్లు ఉచిత ప్రయాణం కుదరదిక- ఆంక్షలపై కసరత్తు
బెంగళూరు: కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా ఉచితంగా ప్రయాణించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిన నేపథ్యంలో మహిళలు దీన్ని వినియోగించుకుంటోన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలామందికి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తోన్నారు. అవసరం ఉన్నా, లేకపోయినా ఆర్టీసీ బస్సుల్లో ట్రావెల్ చేయడానికి వెనుకాడట్లేదు.
ఈ నెల 11వ తేదీన కర్ణాటకలో ఈ పథకం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీని కింద మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. ప్రయాణ సమయంలో ఆధార్ కార్డ్, ఓటరు కార్డు లేదా తాము కర్ణాటకలో నివసిస్తోన్నట్లు రుజువు చేసే ఏదైనా ఇతర గుర్తింపు కార్డును కండక్టర్‌కు చూపించాల్సి ఉంటుంది.

కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ), బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ), నార్త్ వెస్ట్ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎన్‌డబ్ల్యూ ఆర్టీసీ), కళ్యాణ కర్ణాటక/నార్త్ ఈస్ట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఈశాన్య ఆర్టీసీ) బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. రాజహంస, వజ్ర, వాయు వజ్ర, ఐరావత, ఐరావత క్లబ్ క్లాస్, ఐరావత గోల్డ్ క్లాస్, అంబారీ, అంబారీ డ్రమ్ క్లాస్, అంబారీ ఉత్సవ్, ఎఫ్‌టి బస్, ఈవీ పవర్ ప్లస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు.
మహిళలు పెద్ద సంఖ్యలో వారంతపు రోజుల్లో ఉచితంగా ప్రయాణిస్తోన్నారు. ధర్మస్థల, కుక్కె సుబ్రహ్మణ్యం, మురుడేశ్వర్, హంపి, మైసూరు, మలే మహదేశ్వర బెట్ట, ఉడుపి, శృంగేరి.. వంటి పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్తోన్నారు. ఫలితంగా ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించే బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి. టికెట్ తీసుకుని ప్రయాణించే ఇతరులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోన్నారు. వారి నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి.
ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని సిద్ధరామయ్య సర్కార్ కొన్ని ఆంక్షలను విధించే అవకాశాలను పరిశీలిస్తోంది. వీకెండ్, పండగలు, సెలవురోజుల్లో మహిళల ఉచిత ప్రయాణాన్ని నియంత్రించడానికి అవసరమైన చర్యలను తీసుకోనుంది. ఇందులో భాగంగా ఆన్‌లైన్ రిజర్వేషన్ వ్యవస్థను వారికి వర్తింపజేయాలనే నిర్ణయం తీసకున్నట్లు తెలుస్తోంది. బస్సుల్లో స్టాండింగ్‌ను నివారించడానికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తోంది.

ముందుగా వచ్చిన వారికి ముందుగా అనే ప్రాతిపదికన సీట్లను కేటాయించేలా ప్రణాళికలను రూపొందించే ప్రయత్నాల్లో ఉంది కర్ణాటక ప్రభుత్వం. ఆన్‌లైన్ రిజర్వేషన్‌లో 50 శాతం మాత్రమే సీట్లను మహిళలకు కేటాయించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. మిగిలిన 50 శాతం సీట్లను టికెట్ పెట్టి ట్రావెల్ చేసే ఇతరులకు కేటాయించనుంది. ఒకవేళ- ఈ సీట్లు భర్తీ కాకపోతే.. వాటిని మహిళలకు కేటాయిస్తుంది.
పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో తొలిదశలో ఈ ఆన్‌లైన్ రిజర్వేషన్ వ్యవస్థను ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ప్రారంభ రోజులు కావడం వల్ల ఈ రద్దీ ఏర్పడిందని, క్రమంగా తగ్గుతుందని రాష్ట్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ అధికారులు అంచనా వేస్తోన్నారు. నెలరోజుల వ్యవధిలో ఈ స్థాయి తాకిడి ఉండబోదని చెబుతున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications