మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే మీద చర్యలకు హైకోర్టు ఆదేశం, పాస్ పోర్టులో ఫోర్జరీ సంతకం ?

బెంగళూరు: భారత్ మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే మీద వచ్చిన ఫోర్జరీ సంతకం ఫిర్యాదు స్వీకరించి పరిశీలించాలని బెంగళూరులోని కోరమంగళ పాస్ పోర్టు అధికారులకు కర్ణాటక హై కోర్టు సూచించింది. ఇంతకు ముందే అనిల్ కుంబే మీద ఫిర్యాదు పరిశీలించి ఉంటే ఆ వివరాలు ఇవ్వాలని పాస్ పోర్టు అధికారులకు కర్ణాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అనిల్ కుంబ్లే భార్య చేతనా మొదటి భర్త కుమార్. వి. జాగిర్ దార్ ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని కర్ణాటక హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మా ఇద్దరికి జన్మించిన ( ప్రస్తుతం అనిల్ కుంబ్లే భార్య చేతనా) అమ్మాయి పాస్ పోర్టు రెన్యువల్ చెయ్యడానికి తన సంతకాన్ని నా మాజీ భార్య ప్రస్తుత భర్త అనిల్ కుంబ్లే ఫోర్జరీ చేశారని కుమార్ వి. జాగిర్ దార్ ఫిర్యాదు చేశారు.

Karnataka High Court directs bengaluru Passport office to take complaint against former Cricketer Anil Kumble

అయితే పాస్ పోర్టు అధికారులు తన ఫిర్యాదును పరిశీలించలేదని కుమార్ వి. జాగిర్ దార్ ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. గతంలో కుమార్ వి. జాగిర్ దార్ ఆయన మాజీ భార్య రెండవ భర్త, మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే మీద ఇచ్చిన ఫిర్యాదు ఎఫ్ఐఆర్ రద్దు అయ్యింది.

కుమార్ వి. జాగిర్ దార్ అర్జీ పరిశీలించిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి బి. వీరప్ప నేతృత్వంలోని ఏకసభ్య బెంచ్ అనిల్ కుంబ్లే మీద చర్యలు తీసుకోవాలని కోరమంగల పాస్ పోర్టు కార్యాలయం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. తన సంతకాన్ని నా మాజీ భార్య చేతనా రెండవ భర్త అనిల్ కుంబ్లే ఫోర్జరీ చేశారని 2012 జనవరి 10వ తేదీ కుమార్ వి. జాగిర్ దార్ ఫిర్యాదు చేశారు.

కుమార్ వి. జాగిర్ దార్ ఫిర్యాదును మీరు ఇంతకు ముందే పరిశీలించి ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే వివరాలు సమర్పించాలని కర్ణాటక హైకోర్టు పాస్ పార్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 1986లో కుమార్ వి. జాగిర్ దార్ ,చేతనా రామతీర్థ వివాహం జరిగింది.

కుమార్ వి. జాగిర్ దార్, చేతనా రామతీర్థ దంపతులకు అరుణి అనే కుమార్తె పుట్టింది. 1999లో కుమార్ వి. జాగిర్ దార్, చేతనా రామతీర్థ దంపతులు విడాకులు తీసుకున్నారు. అనంతరం అనిల్ కుంబ్లే చేతనాను రెండవ పెళ్లి చేసుకున్నారు. 2012లో చేతనా కుమార్తె అరుణి తన కుమార్తె అంటూ అనిల్ కుంబ్లే తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని కుమార్ వి. జాగిర్ దార్ ఫిర్యాదు చేశారు. తన మైనర్ కుమార్తె పాస్ పోర్టు రెన్యువల్ చెయ్యడానికి తన సంతకాన్ని అనిల్ కుంబ్లే ఫోర్జరీ చేశారని కుమార్ వి జాగిర్ దార్ కోర్టును ఆశ్రయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+